ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో ఐబీ విద్యావిధానం - 'ఐబీ' విద్య అమలుకు ఒప్పందం
👁️🗨️ ఈ కీలక ఒప్పందం ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
👁️🗨️ ఉపాధ్యాయులతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధికారులు, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది ఐబీ బోధనపై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణను ఇవ్వనున్నారు.
👁️🗨️ దీంతో వారంతా ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానుంది.
👁️🗨️ ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు.
👁️🗨️ పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, APSCERT ఉమ్మడిగా సర్టిఫికెట్ను ప్రదానం చేస్తాయి. ఈ ధ్రువపత్రానికి అంతర్జాతీయం గుర్తింపు ఉంటుంది.
ప్రభుత్వ బడుల్లో 'ఐబీ' విద్య అమలుకు ఒప్పందం
◾ఐబీ( ఇంటర్నేషనల్ బాకలారియెట్ ) సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
◾ఈ ఒప్పందం ప్రకారం 2024-25 2 సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి 'ఐబీ'పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లీ భాగమవుతారు.
◾2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్ కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.
0 Post a Comment:
Post a Comment