Saturday 23 July 2022

IT రిటర్న్ లో పొందగలిగే మినహాయింపులు

IT రిటర్న్ లో పొందగలిగే మినహాయింపులు



1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.

2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.

4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C, 

వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.

80EE క్రింద మరొక 50000 అదనంగా మినహాయింపు పొందవచ్చు.

9. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.

10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.

11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.

ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top