మరో ఉద్యమానికి సిద్ధం - పీఆర్సీ, సీపీఎస్ తదితర అంశాలపై రాజీలేని పోరాటం
● జస్టిస్ ఫర్ పీఆర్సీ నినాదంతో దశలవారీగా కార్యాచరణ
● ఉద్యమానికి 30కిపైగా ఉద్యోగ సంఘాల మద్దతు
● ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల వేదికగా ఏర్పాటు
● పీడీఎఫ్. స్వతంత్ర ఎమ్మెల్సీల మద్దతుతో పోరుబాట
పీఆర్సీపై మరో ఉద్యమం చేసే దిశగా ఉపాద్యాయ సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కలిసి వచ్చే ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. అందు లో భాగంగా శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 34 సంఘాలు హాజరై, ఐక్య గళాన్ని వినిపించాయి. ఈ సంద ర్భంగా ఫ్యాప్టో చైర్మన్ జోసఫ్ సుధీర్ బాయి మాట్లాడుతూ 11వ పీఆర్సీలో ప్రస్తుతం చెల్లిస్తున్న ఐఆర్తో సమానంగా ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలని, 2020 ఏప్రియల్ నుంచి గ్రాట్యూటీ మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను ప జనరుద్ధరించాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదికగా ఏర్పాటై తమ డిమాండ్ల సాధనకోసం పోరాడతామని స్పష్టం చేశారు. సెక్రటరీ జనరల్ సీహెచ్ శరత్ చంద్ర మాట్లాడుతూ సమావేశంలో పలు తీర్మానాలు చేశామని, ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. పీడీఎస్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిర, పెన్షనర్ల వేదికలలో చర్చించాలని ప్రాతినిధ్యం చేయాలని తీర్మానించారు. అదే రోజున చీఫ్ సెక్రటరీకి కార్యాచరణ నోటీసు అందజేయాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పీఆర్సీపై ప ఎనః సమీక్షించాలని సంతకాల సేకరణ చేపట్టాలని తీర్మానించారు. 21. నుంచి 24 వరకు పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల నుంచి వ్యాలెట్ నిర్వహించాలని, అవే తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. ఈ నెల 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ పంపాలని, మార్చి 2, 3 తేదీలలో జిల్లా కేంద్రాలలో రిలే నిరాహారదీక్షలు, మార్చి 7, 8 తేదీలలో విజయవాడలో కలిసి వచ్చే సంఘాలతో రిలే నిరాహారదీక్షలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతామని నేతలు తెలిపారు.
0 Post a Comment:
Post a Comment