Friday 18 February 2022

టీచర్ల పదోన్నతుల సమస్యలపై తక్షణ చర్యలు : ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల హామీ

 టీచర్ల పదోన్నతుల సమస్యలపై తక్షణ చర్యలు : ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల హామీ



ఉపాధ్యాయుల పదోన్నతుల విధి విధానాలపై తక్షణమే చర్య లు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదు ర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అధ్యక్షతన శుక్రవా రం ఉపాధ్యాయ సంఘాల ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథి సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి పలు సమస్యలను సంఘాల నేతలు తీసుకొచ్చారు. డెమోక్రాటిక్ పీఆర్టీయూ (ఏపీ) తరుపున పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీను మూడు నుంచి ఐదో తరగతి వరకు హైస్కూల్లో విలీనం చేస్తున్నందున  ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతిపై విధి విధానాలు రూపొందించి షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీలు ఏర్పాటవుతున్నందున అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులను ప్రిన్సిపల్గాను, స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ పదోన్నతి కలిపించాలని కోరారు. ఈ మేరకు సజ్జలకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పిన అంశాలను సావధానంగా విన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు అన్నింటిని పరిష్కరిస్తామన్నారు. ఆయా సమస్యలు, పదోన్నతులపై విధివిధానాలు రూపొందించేందుకు తక్షణమే అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తమ వినతి పట్ల సానుకూలంగా స్పందించిన సజ్జల రామకృష్ణా రెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త, ఎమ్మెల్సీ టీ. కల్పలతా రెడ్డికి ఆయా సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top