Saturday 26 February 2022

అన్ని వనరులతో అత్యుత్తమ బోధన

అన్ని వనరులతో అత్యుత్తమ బోధన



■ మ్యాపింగ్‌ ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని వనరులు అందుబాటులోకి రావడంతోపాటు అత్యుత్తమ బోధన అందుతుంది.

■ ఇప్పటివరకు అతీగతీ లేనట్లుగా మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాలు ఫౌండేషన్‌ విద్యా కేంద్రాలుగా మారనున్నాయి.

■ ఇవి ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలల్లో కలవడం ద్వారా చిన్నారులకు  పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన బోధన అందుతుంది.

■ ఫౌండేషన్‌ స్కూళ్లలో ముగ్గురు అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులతోపాటు ఇద్దరు ఎస్‌జీటీ టీచర్లను నియమిస్తారు. హైస్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులుంటారు.

■ విద్యార్థుల సంఖ్యను అనుసరించి 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు.

■ ఈ స్కూళ్లకు అనుసంధానమయ్యే ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వర్చువల్‌ డిజిటల్‌ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి.

■ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద తరగతుల పిల్లలతో కలిసి ఉండటంవల్ల పై తరగతులకు వెళ్లేకొద్దీ ఆ వాతావరణానికి సులభంగా అలవాటు పడతారు. 

■ ప్రస్తుతం ప్రైమరీలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూలులో 6వ తరగతిలో చేరే సమయంలో ఒకింత బెరుకుగా ఉంటున్నారు. కొన్నిచోట్ల ఇది డ్రాపౌట్లకు దారితీస్తోంది.

■ అంగన్‌వాడీల నుంచి ప్రైమరీలోకి వచ్చే పిల్లల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మ్యాపింగ్‌తో ఇలాంటి ఇబ్బందులు దూరం కానున్నాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top