Saturday 26 February 2022

ఆరంచెల విద్యా విధానమిలా...

ఆరంచెల విద్యా విధానమిలా...



★ అంగన్‌వాడీ కేంద్రాలు (సమీపంలో ఏ స్కూలు లేని) మాత్రమే ఉండే చోట వాటిలో ప్రీ ప్రైమరీ 1 , ప్రీ ప్రైమరీ 2 ( పీపీ 1 , పీపీ 2 )లను ప్రవేశ పెట్టి శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా కొనసాగిస్తారు.

★ ప్రైమరీ పాఠశాలలు సమీపంలో ఉంటే అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పీపీ 1 , పీపీ 2లను 1, 2 తరగతులతో ఫౌండేషన్‌ స్కూళ్లుగా నిర్వహిస్తారు.

★ ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ 1 , పీపీ 2 లను, 1 నుంచి 5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లుగా నిర్వహిస్తారు.

★ సమీపంలో అప్పర్‌ ప్రైమరీ స్కూలు ఉంటే 3 నుంచి 5 తరగతుల పిల్లలను అనుసంధానించి 3 నుంచి  7 లేదా 8 వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా కొనసాగిస్తారు.

★ ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లుగా నిర్వహిస్తారు.

★ 3 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్‌ (11 , 12 తరగతులు) కలిపి హైస్కూల్‌ ప్లస్‌ గా మారుస్తారు.

టీచర్లకు ఎన్నో ప్రయోజనాలు :

◆ మ్యాపింగ్‌ వల్ల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పలు ప్రయోజనాలు కలుగుతాయి.

◆ ప్రైమరీ పాఠశాలల్లో పాత విధానంలో 1 నుంచి 6 తరగతుల విద్యార్ధులకు మొత్తం 18 సబ్జెక్టులు బోధించేవారు.

◆ ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్న చోట్ల వారిపై విపరీతమైన పనిభారం ఉంది. విద్యార్ధులకు సరైన బోధనకు అవకాశం ఉండేది కాదు.

◆ కొత్త విధానంలో ప్రైమరీ స్కూళ్లలోని 1, 2 తరగతుల విద్యార్థులకు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీలను ప్రభుత్వం నియమించనుంది.

◆ వీరిపై పనిభారం చాలా తగ్గుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులు హైస్కూల్లో చేరడం వల్ల దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి.

◆ మరోపక్క ప్రతి మండలంలో రెండేసి హైస్కూళ్లలో జూనియర్‌ కాలేజీల ఏర్పా టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

◆ ఈమేరకు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటవుతాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లకు ఆయా జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్‌ స్థాయి పదోన్నతులు రానున్నాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top