Sunday, 6 February 2022

మినిట్స్‌లో సంతకాలు పెట్టలేదు

మినిట్స్‌లో సంతకాలు పెట్టలేదుఉపాధ్యాయ నేతలు హృదయరాజు, ప్రసాద్‌, సుధీర్‌బాబు వెల్లడి

జేఏసీ పదవులకు ఏపీటీఎఫ్‌ రాజీనామా

నేటి నుంచే నిరసనలు

ఈ నెల 5వ తేదీన మంత్రుల కమిటీతో సమావేశం మినిట్స్‌లో తాము సంతకాలు పెట్టలేదని పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు.. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. హాజరైనట్లు అటెండెన్స్‌ షీటులో సంతకం మాత్రమే పెట్టామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ తదితర డిమాండ్లపై మంత్రులను గట్టిగా అడిగ్గా, అందులో మార్పులు చేసే ప్రసక్తే లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సీఎం వద్ద మాట్లాడే అవకాశం కల్పించాలని కోరినా కుదరదని చెప్పడంతో  తాము ఈ అంశాలపై డిఫర్‌ అవుతున్నామని మంత్రులకు, స్టీరింగ్‌ కమిటీ సమావేశంలోనూ స్పష్టంగా తేల్చామన్నారు. ఒప్పందాల (తీర్మానాలు, మినిట్స్‌) పత్రంపై తాము ముగ్గురం సంతకాలు చేయలేదన్నారు.

అన్యాయంపై పోరుబాట :

ప్రభుత్వం ఉద్యోగులను చులకన, మోసం చే సిందని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌, హృదయరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులకు జరిగిన అన్యాయంపై తగిన కార్యాచరణ రూపొందించుకుని పోరుబాట పడతామని చెప్పారు. ఉపాధ్యాయుల అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిదని కేఆర్‌ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ చర్యలపై న్యాయపోరాటాన్ని ప్రారంభిస్తామన్నారు. సంప్రదింపుల కమిటీ తీర్మానాలపై తాము సంతకాలు చేశామని సూర్యనారాయణ చెప్పటం తగదన్నారు.

కలిసొచ్చే సంఘాలతో...

రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడటంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం చెందారని, కలిసొచ్చే సంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వర ప్రసాదరావు చెప్పారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలను స్టీరింగ్‌ కమిటీలో పెట్టలేదని చెప్పారు. ఉద్యమానికి స్టీరింగ్‌ కమిటీ తీవ్ర ద్రోహం చేసిందన్నారు. సోమవారం నుంచే నిరసనలు ప్రారంభమవుతాయన్నారు. రెవెన్యూ, జ్యూడిషియరీ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సంఘాలు తమ తో కలిసి పని చేస్తాయన్నారు. ఫ్యాప్టోతో సమావేశమైన తర్వాత తగిననిర్ణయం తీసుకుంటామన్నారు.

ఏపీ జేఏసీది మోసపూరిత వైఖరి :

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు వమ్ము చేసిన ఏపీ జేఏసీ అప్రజాస్వామిక మోసపూరిత వైఖరికి నిరసనగా జేఏసీలోని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ ప్రకటించింది. ఏపీ జేఏసీ కో చైర్మన్‌గా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.భానుమూర్తి, కార్యవర్గ సభ్యుడిగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగారావు ఉండేవారు. జేఏసీ పదవులకు రాజీనామ చేస్తున్నట్లు వారిద్దరూ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top