Saturday 12 February 2022

14 నుంచి పాఠశాలల్లో కెరీర్ వీక్

14 నుంచి పాఠశాలల్లో కెరీర్ వీక్



వృత్తుల ఎంపికపై అవగాహన :

■ ప్రభుత్వ , జడ్పీ , పురపాలక , కార్పొరేషన్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు కోర్సులు , జీవితంలో స్థిరపడేందుకు ఎంచుకోవాల్సిన కెరీర్ గురించి అవగాహన కల్పించనున్నారు.

 ■ ఉన్నత పాఠశాలల్లో 9 , 10 వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.

■ పాఠశాలల్లో కెరీర్ గైడెన్సుపై ఉన్నత ఉపాధ్యాయులకు డైట్ అధ్యాపకులు , ప్రత్యేక రిసోర్సు పర్సన్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఈ ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కెరీర్పై మార్గదర్శనం చేస్తారు.

■ ఈ నెల 14 నుంచి 19 వ తేదీ వరకు ' కెరీర్ వీక్ ' నిర్వహించనున్నారు . ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో 9 , 10 వ తరగతుల విద్యార్థులకు రోజూ రెండు పిరియడ్లు కెరీర్పై అవగాహన కల్పిస్తారు . 14 న ముందుస్తు పరీక్ష , 19 న తుది పరీక్ష నిర్వహించి వారి ప్రత్యేక సామర్థ్యాల్ని అంచనా వేస్తారు . వీటి ఆధారంగా వారు ఏ కెరీర్లో రాణించే అవకాశం ఉందో తెలియజేస్తారు . దీనికి సంబంధించి విద్యార్థులకు , ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధన సామగ్రి పంపారు.

కార్యక్రమం ఇలా...

■ ఈ నెల 14 న విద్యార్థి కుటుంబంలో ఉన్న వృత్తులు , రోల్ మోడల్ గురించి చెప్పి ముందస్తు పరీక్ష నిర్వహిస్తారు.

■ 15 న విద్యార్థి బలాలు , వాటిని ఉపయోగించుకునే విధానం , అతనికి ఇష్టమైన కెరీర్ను అంచనా వేసి సొంతంగా అవగాహ పొందే విధంగా మార్గదర్శనం చేస్తారు.

■ 16 న హాల్ల్యాండ్ కెరీర్ కోడ్ పరీక్ష నిర్వహిస్తారు.

■ 17 న వృత్తులకు సంబంధించిన , విద్యాపరమైన సమాచారం , జాబ్ కార్డులు , కెరీర్ను ఎంచుకునే విధానం గురించి చెబుతారు.

■ 18 న విద్యార్థి భవిష్యత్తు ప్రణాళిక , తన ప్రత్యేకను చాటుకునే విధానంపై వివరిస్తారు.

■ 19 న కెరీర్ డే వేడుకలు నిర్వహిస్తారు.

■ ఉదయం వ్యాసరచన , వక్తృత్వం ,తాను ఎంచుకున్న కెరీర్కు  అనుగుణమైన దుస్తులు ధరించటం , ' నా కెరీర్ - నా ఎంపిక అనే అంశంపై రెండు నిమిషాల వీడియోను సంబంధిత విద్యార్థితో చేయిస్తారు . అదే రోజు రెండో పూట అతిథి ఉపన్యాసాలు , తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top