నేడు మరోసారి మంత్రుల కమిటీ సమావేశం - చర్చలకు ఉద్యోగ సంఘాలు ససేమిరా
నూతన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి సమ్మె విర మింప జేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ గురువారం సచివాలయంలో మరోసారి. సమావేశంకానుంది. సోమవారం కమిటీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు హాజరు కాలేదు. అయితే మంగళవారం పీఆర్సీ సాధనా సమితికి సంబంధించిన ప్రధాన నేతలు కాకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులు 9 మంది రెండు గంటలు ఆలస్యంగా కమిటీతో భేటీ అయ్యారు. మూడు ప్రధాన డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని కమిటీకి అందజేశారు. వాటిలో నూతన పీఆర్సీ జీఓలు రద్దు లేదా అబయేన్స్, అసుతోష్ మిశ్రా నివేదిక బయట పెట్టాలని, జనవరి నెల జీతం పాత విధానంలో ఇస్తే చర్చలకు వస్తామని చెప్పారు. అయితే స్టీరింగ్ కమిటీ సభ్యులు అంతా కలిసి వస్తే వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుక వెళతామని మంత్రుల కమిటీ సూచించింది. గురువారం మరో సారి చర్చలకు ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ ఆహ్వానించింది.
అయితే పీఆర్సీ జీఓలు వెనక్కు తీసుకునేది లేదని మిగిలిన విషయాలపై చర్చించి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చూస్తామని కమిటీ పేర్కొంది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం విజయ వాడలో సమావేశమైన సాధనా సమితి స్టీరింగ్ కమిటీ గురువారం మంత్రుల కమిటీ సమావేశానికి వెళ్ల కూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్ప టికే కమిటీకి అందజేసిన డిమాండ్లు తీరుస్తేనే చర్చ లకు వెళ్లాలని నిర్ణయం చేసినట్లు తెలుస్తోంది.
0 Post a Comment:
Post a Comment