పత్రికా ప్రకటన - చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.
ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పి ఆర్ సి విషయంలో ఉద్యోగులు ప్రభుత్వం తో చర్చలకు రాకుండా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరువేరు కాదని గుర్తించాలన్నారు. జి ఓ కాపీలు తగులబెట్టడం, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేయటం సరికాదన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం మంచిది కాదని ఎప్పటికైనా సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. ఒకసారి చర్చలకు వెళ్లి సంప్రదింపులు జరిపిన తరువాత ఇప్పుడు వెనక్కి తగ్గటమేమిటని ఉన్న ఇబ్బందులు మరలా చర్చల ద్వారా తెలియజేయవచ్చు కదా అన్నారు.
శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.
0 Post a Comment:
Post a Comment