Tuesday 25 January 2022

గురువును అవమాన పరిస్తే పాలకుడైనా, పండితుడైనా పతనమవుతారు.

 గురువును అవమాన పరిస్తే పాలకుడైనా, పండితుడైనా పతనమవుతారు.




భూమిపై జీవజాతిలో మూగ జీవులంటికీ తల్లే గురువు... పుట్టినప్పటి నుంచి ఆహారం ఎలాతినాలో, అనంతరం రెక్కలు (పక్షి జాతి )వచ్చిన తర్వాత, నడక నేర్చిన తరువాత మిగిలిన జంతు జాతి తమ తమ వారస పిల్లలకు తిండి (ఆహారం )ఎలా సంపాదించాలో తల్లి మాత్రమే నేర్పుతుంది. మాటలు అనే విజ్ఞానం గల మనిషికి మాత్రం తల్లి అధిపోషకురాలు, అనంతరం తల్లిదండ్రులు, ఆది గురువులు వారి తరువాత అక్షర జ్ఞానం, విద్య నేర్పేది గురువే... అనంతరం దేవుడు (నమ్మినవారికి )గురువు పూజ్యనీయుడు. అది రాముడికైనా, దేశాధ్యక్షుడుకైనా, కలెక్టర్ కు అయినా, గుమస్తాకి అయినా.... యాక్టర్ కైనా, డాక్టర్ కైనా తనకు ఎదురు పడితే ఏమిరా... ఏమి చేస్తున్నావు?, ఎలా వున్నావు? అని ఏమిరా అనే పిలిచే అధికారం ఒక్క గురువుకే వుంది. దేశ ప్రధాని అయినా,ప్రపంచానికి అధిపతి అయినా,జిల్లాకు కలెక్టర్ అయినా తనకు విద్య (అక్షర జ్ఞానం )నేర్పిన గురువు కనిపిస్తే రెండు చేతులు జోడించి వంగి నమస్కారం పెట్టాలి... స్థాయిని చూసి గురువును మరచిపోతే ఆ స్థాయి ఉండదు. పతనం ఏర్పడుతుంది. అంత గొప్ప శక్తి గురువులకు వుంది. గురువులు అంటే విద్య నేర్పినవారు. బాల్యంలో అక్షరం నేర్పి ఒకటి నుంచి ఐదు తరగతి వరకు చదువు చెప్పిన వారిని "గురువు" అంటారు. ఆరునుంచి పదవ తరగతి వరకు విద్య నేర్పిన వారిని ఉపాధ్యాయులు (టీచర్ )అంటారు. ఇంటర్లో, డిగ్రీ లలో లెక్చరర్,అంటారు. పి. జీ. లో ప్రొఫెసర్, పీహెచ్డీ లో డీన్స్ అంటారు. ఇందులో అందరూ విద్య నేర్పినవారే... వారే గురువులు వీరికి ఎవరైనా పాదాభివందనం చేయాలి. గురువుల్లో వ్యక్తిగత అవలక్షణాలు, రుగ్మతలు కలిగిన కొంతమంది ఉండవచ్చు... అలాంటి వారిని చూపించి గురువు అనే పవిత్రతపై దాడి చేయకూడదు. అలాంటి వారిని ప్రభుత్వం పనిస్మెంట్ ఇవ్వవచ్చు. విద్యా గురువు వ్యవస్థను అవమాన పరచిన వారు పాలకులయినా, పామరులైనా పతనమైపోతారు. మనరాష్ట్రంలో 1968,69, కాలం నాటికి ఉపాధ్యాయులను బతకలేక బడి పంతులు అనేవారు..అలా దశాబ్థాల ఉద్యమ ఫలితంగా "బతకలేని బడిపంతులు నుండి బ్రతుకు నేర్పే బడి పంతులుగా" రూపాంతరం చెందాడు.అయినా అలాంటి ప్రభుత్వ నిరాకరణ, సమాజ, చిన్న చూపులను భరించి ఆనాడు ఉపాధ్యాయులు వృత్తిని నమ్ముకొని కొనసాగారు. అప్పట్లో ఉపాధ్యాయుల జీవితం, పేద ప్రజల జీవితం ఒకేలా ఉండేది.

1968,69లలో, అప్పటి శ్రీకాకుళం జిల్లా (1979లో విజయనగరం జిల్లా అయింది )లో "ఆధిపట్ల కైలాసం, వెంపటాపు సత్యం" అనే ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మమైన  విద్య నేర్పుతూ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో వున్న గిరిజన ప్రజలు, మైదాన ప్రజల జీవన స్థితిగతులను కూడా తెలుసుకున్నారు. అప్పట్లో గిరిజన ప్రజల జీవన అవసరాల వస్తువులు కొనుగోలు కోసం సమీప గిరిజన పెద్ద మైదాన గ్రామాలలో, మైదాన ప్రజలకోసం సమీప పట్టణాలులో వారపు సంతలు జరిగేవి (ఇప్పటిలాగ షాపింగ్ మాల్స్ )లేవు. కొండలుపైనా, కింది పరిసర గ్రామాలలో జీవించే గిరిజన ప్రజలు వారంకి ఒకసారి వచ్చే వారపు సంతలో తాము పండించిన పంట దినుసులు తీసుకువస్తూ వారికి దొరకని వస్తువులను కొనుక్కొని వెళ్లేవారు. గిరిజనులకు దొరకని వారానికి అవసరమైన ఉప్పు, దీపం బుడ్డి కోసం కిరోసిన్, బెల్లం, వంట నూనె, కారం, పసుపు, అవసరం మేరకు బియ్యం కొనుక్కొని వెళ్లేవారు. ఆ గిరిజనులను మూగజీవులుగా (తెలివి లేని అమాయకులుగా )భావించిన మైదాన వ్యాపారాలు )షావుకారులు వారికి చోలడు ఉప్పు, బుడ్డీ కిరోసిన్, ఒక 100గ్రాముల బెల్లం ముక్క,బెల్లంతో తయారు చేసిన కజ్జం ఉండలు 2లేక3 ఇచ్చి ఒక్కొక్క వస్తువుకి వారివద్ద నుంచి కుంచడు చొప్పున వారి పంట దినుసులు తీసుకొనే వారు.

ఈ దోపిడీని గ్రహించిన ఆ ఉపాధ్యాయులిద్దరు ఆ గిరిజనులను చైతన్య పరచే కార్యక్రమం చేపట్టారు. మనతో పాటు పుట్టిన ఆ అమాయకులను వారపు సంత వ్యాపారులు దోపిడీని అరికట్టే ఉద్యమం చేపట్టారు. అది ఈ దోపిడీ దారులకు, గిరిజనులను చైతన్యం చేస్తున్న టీచర్లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. అప్పటికే బెంగాల్ నక్జల్ బరీ అనే గ్రామం నుంచి దోపిడీ దారులకు వ్యతిరేకంగా చారు మజుందార్ అనే కమ్యూనిస్ట్ నేత నాయకత్వంలో ప్రజా ఉద్యమం జరుగుతోంది. శ్రీకాకుళం గిరిజన ప్రజల తరపున హక్కుల పోరాటానికి  "కైలాసం, సత్యం" మాస్టారు లిద్దరూ తమ పోరాటానికి మద్దత్తు కోసం బెంగాల్ చారు మంజుందార్ సహకారం తో గిరిజన ప్రజా గెరిల్లా నక్షలైట్ ఉద్యమాన్ని, గిరిజన రైతుల తిరుగుబాటు నక్షలైట్ శ్రీకాకుళ మహోద్యమంగా మార్చారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తన సైనిక బలంతో ఉద్యమాన్ని అణచివేసి, ఈ ఉద్యమ ప్రధాన నేతలైన కైలాసం, సత్యం మాస్టర్లు కూడా పోలీస్ కాల్పుల్లో మరణించారు.

అనంతరం అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ శ్రీకాకుళ నక్షలైట్ మహా ఉద్యమానికి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించి ఉపాధ్యాయులు తలచుకొంటే సామాజిక చైతన్య ఉద్యమాలను లేవనేత్తగలరు అని భావించి అప్పటికి బతకలేని బడి పంతుల్లుగా వున్న జీతాలను చట్టం చేసి అమాంతంగా పెంచారు. దీనితో పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పెంచే చట్టం చేశారు. ఆ వెంటనే గిరిజన జీవన ఉద్దరణ కోసం 1970లో ITDA లను, జీసీసీ లను ఏర్పాటుచేసారు. అనంతరం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పాలకులు విద్య, పాఠశాలల అభివృద్ది, క్రమ పద్దతిలో ఉపాధ్యాయుల భర్తీ, మినిమమ్ జీతాలు పెంపు జరుగు తున్నాయి.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక పోరాటాల ఫలితంగా ప్రస్తుత గౌరవమైన చట్టబద్ధమైన జీతాలు పొందగలుగు తున్నారు. ఉద్యోగుల శ్రమను, త్యాగాలను కించపరిచే ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు, సాగించలేవు.

ప్రజలకోసం, రాష్ట్ర అభివృద్ధికోసం, సంక్షేమం, విద్య, ఆరోగ్య, ఉపాధి,రంగాలు ప్రభుత్వాలు సక్రమంగా నడిపించుకోవాలంటే చట్ట పరంగా కొనసాగుతున్న, ఉపాధ్యాయ, ఉద్యోగుల జీత, బత్యాలు పాలకులు సక్రమంగా అమలు చేయాలి. వారిచే సక్రమంగా పనిచేయించుకోవాలి.

ఇట్లు

పెద్దింటి శ్రీరాములు, సీనియర్, జర్నలిస్ట్, సాలూరు.,విజయనగరం జిల్లా

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top