డిజిటల్ లాకర్‌లో పదో తరగతి మెమోలు
పదో తరగతి మార్కుల జాబితాలను (మెమో) పోగొట్టుకుంటే వాటిని పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ లాకర్ విధానంలోకి ప్రభుత్వ పరీక్షల విభాగం వెళ్లబోతోంది. అభ్యర్థులు ఎప్పుడైనా తమ మెమోను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. పది పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే మెమోలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆఫ్‌లైన్ విధానంలోనూ మెమోలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని సీబీఎస్‌ఈ బోర్డు అమలు చేస్తోంది. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, పీడీఎఫ్ రూపంలో ఫోన్‌లోనూ ఉంచుకోవచ్చు. ఈ డిజిటల్ లాకర్ విధానం 45 రోజుల్లో అందుబాటులోకి రానుంది. 2004 నుంచి జారీ చేసిన మార్కుల జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. అంతకుముందు జారీ చేసిన మెమోల డేటానూ ఉంచేందుకు పరిశీలన చేస్తున్నారు. ఆధార్‌కార్డు, హాల్‌టికెట్ నంబర్ల ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలతో పాటే ఆన్‌లైన్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
0 Post a Comment:
Post a Comment