Wednesday 12 January 2022

మధ్యాహ్న భోజన పథకము ( జగనన్న గోరు ముద్ద ) & పారిశుధ్యం గురించి క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు

 మధ్యాహ్న భోజన పథకము ( జగనన్న గోరు ముద్ద ) & పారిశుధ్యం గురించి క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలు



MDM / TMF / Sanitary Napkins కు సంబంధించి దాదాపు 10 రకముల రిజిష్టర్లు నిర్వహించవలెను చాలా పాఠశాలలలో సక్రమముగా నిర్వహించక పోవటంతోపాటు రిజిష్టర్స్ open చేయకపోవడం గుర్తించడమైది.

List of Registers : 

1. Rice , Eggs , Chikkies , Dal , Stock Register - Sanitary Napkins & Toilets materials.

2. Dry Ration Distribution Register.

3. Day wise Indent Register.

4. Sanitary workers ( Aya ) Attendance Register. 

5. Visitors Book.

6. P.C. Resolution Register. ( Appointment of MDM Agencies & Aya )

7. Dry Ration Acquaintance Register. 

8. MDM Taste Register.

అన్ని రిజిష్టర్ల నిర్వహించి ఎప్పటికప్పుడు Update చేయవలెను.

క్షేత్ర స్థాయిలో MEO / CRP / Edn.Wel.Asst/ సచివాలయ సిబ్బంది పాఠశాల visit చాలా తక్కువగా ఉన్నది . వారి Job Chart ప్రకారం విధులు నిర్వహించవలెను . 

క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు ప్రధానోపాధ్యాయుడు / ఉపాధ్యాయులు / Parent Committee / విద్యార్థులకు చాలా మందికి ఈ పథకం గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేదు . కావున వెంటనే అవగాహన కల్పించవలెను . 

Ex : Records , Menu , Egg ( 50 gms ) , Chikki Weight ( 25 gms ) etc...

కొన్ని పాఠశాలలలో Gas Stove వున్నప్పటికి కట్టెల పొయ్యి మీద వంట చేయడం గమనించడమైనది . తప్పనిసరిగా గ్యాస్ స్టవ్ వినియోగించవలెను . విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దూరంగా వంట చేయవలెను . ప్రతి పాఠశాలలో రోజువారి పర్యవేక్షణ కొరకు Rotation Basis మీద ఉపాధ్యాయులకు విధులు కేటాయించుటలేదు. (Indent , Preparation , serving , tasting , cleaning etc...) వెంటనే తగు చర్యలు తీసుకొనవలెను . 

Rice Indent ప్రతినెల 16-21 లోపు APP లో పెట్టాలి . మరియు తప్పనిసరిగా Thumb Impression ద్వారా మాత్రమే Delivery తీసుకోవాలి . Mannual గా తీసుకొనరాదు . ఒక వేళ సాంకేతిక సమస్య ఏర్పడినచో మరుసటి రోజు తప్పనిసరిగా Thumb వేయవలేను . అదనంగా ఎక్కువ మొత్తంలో బియ్యం వచ్చినట్లయితే మండల స్థాయిలో సర్దుబాటు చేయవలేను . Next month 10 లోపు Rice తీసుకోవాలి . Fortified Rice Label వున్న Rice Bag మాత్రమే తీసుకొనవలెను . MDM Agency Bills / Aya / CC ప్రతినెల 5 లోపు complete చేయాలి . Arrear bill వేయబడదు.

HMs దగ్గర వున్న తల్లిదండ్రుల వద్ద నుండి సేకరించిన , 1 వ విడత ( 2019-20 ) సంవత్సరము అమ్మ ఒడి amounts వెంటనే DEO A / C కు remit చేయాలి.

New Agency Approval within one week approve చేయించాలి .ఎట్టి పరిస్థితులలోను ప్రతి రోజు MDM Serve చేయాలి . లేనిచో HM / MEO బాధ్యత వహించవలసియుంటుంది.

ప్రతినెల ప్రధానోపాధ్యాయుడు తీసుకున్న Egg / Chikky రశీదు ఈ క్రింది నమూనాలో మండల విద్యాశాఖాధికారికి సమర్పించవలెను . దాని ప్రకారం మండల విద్యాశాఖాధికారి వారు జిల్లా విద్యాశాఖాధికారి వారికి మండల రిపోర్టు సమర్పించవలెను.

అదేవిధముగా పత్రికలలో వచ్చిన Adverse News items కు వెంటనే Rejoinder సదరు పత్రికకు పంపవలెను.

సాంకేతిక సమస్యలతో రోజునారి విద్యార్థుల హాజరు IMMS App లో నమోదు చేయలేని సందర్భములో తరువాత నెల 1 , 2 తేదిలలో option ఇవ్వబడుతుంది . అందులో సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా నమోదు చేయవలెను . కావున ప్రధానోపాధ్యాయుడు జవాబుదారిగా వ్యవహారించవలసి వుంటుంది .

రోజువారీ Menu తప్పనిసరిగా అందరికి కన్పించే విధముగా ప్రదర్శించాలి .  వంటగది , పరిసరాలు , Toilets etc... ఎప్పటికప్పుడు పరిశుభ్రముగా ఉంచుకొనవలెను మరియు మధ్యాహ్న భోజనం రుచిగా , శుచిగా , తాజాగా విద్యార్థులకు అందించవలెను . కావున జిల్లాలోని అందరు MEOs / HMs పై సూచనలు తప్పనిసరిగా పాటించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా సక్రమముగా నిర్వహించవలెను. లేనిచో వారి పై తగు క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును.


DOWNLOAD GUNTUR DEO INSTRUCTIONS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top