Monday 31 January 2022

AP లో భగ్గుమంటున్న యువత - రేపటినుండి రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు : కొందరు నిరుద్యోగులకు ఈ రెండేళ్ళలో Age Bar అవుతుంది.

 AP లో భగ్గుమంటున్న యువత - రేపటినుండి రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు : కొందరు నిరుద్యోగులకు ఈ రెండేళ్ళలో Age Bar అవుతుంది.



ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుండి 62 ఏళ్ళకు పెంచుతూ AP ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థి, యువజనుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు మొదలయ్యాయి.. అసలే ఉద్యోగాలు, రిక్రూట్మెంట్లు లేక యువత అగమ్యగోచరంగా ఉంటే రాష్ట్రప్రభుత్వం ఇలాంటి అనాలోచిత నిర్ణయాన్ని అమలుచేయటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..

అటు ఉద్యోగులతో పాటు విద్యార్థులు, చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి రగిలింది.

చదువుపూర్తయ్యాక మేమేం చేయాలని విద్యార్థిలోకం ప్రశ్నిస్తుంటే, ఏనాడో చదువు పూర్తిచేసి ఉద్యోగాలకోసం తాము ఏళ్ళతరబడి నిరీక్షిన్నామని యువత వాపోతున్నారు..

పదవీవిరమణ వయసును పెంచినందువల్ల తమకు ప్రమోషన్లు కూడా కరువైపోతాయని, ప్రమోషన్లు లేకుండానే రిటైరవ్వాల్సి వస్తుందని,క్లాస్-4 నుండి గ్రూప్-1 ఇంకా ఆపై అధికారులకు కూడా ఆందోళన కలిగిస్తొంది..

ఈ రోజు కార్యాచరణ ప్రణాళిక తయారుచేసిన తర్వాత రేపటినుండి తాముకూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసే వరకు పోరాడతామని విద్యార్థి, యువజనవర్గాలు స్పష్టం చేశాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top