Sunday 30 January 2022

ABN ఎఫెక్ట్‌తో కదిలిన ఏపీ ప్రభుత్వం

 ABN ఎఫెక్ట్‌తో కదిలిన ఏపీ ప్రభుత్వం



ఏబీఎన్ ఎఫెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం కదిలింది. పెన్షనర్ల పే స్లిప్పులను ఏపీ సర్కార్‌ సరిచేసింది. పెన్షనర్లకు 11వ పీఆర్సీ ప్రకారం ఎరియర్స్‌ కట్ చేసి.. శనివారం పే స్లిప్పులు సీఎఫ్‌ఎంఎస్‌ జనరేట్ చేసింది. ఓ ప్రధానోపాధ్యాయుడికి గతనెలలో తీసుకున్న పెన్షన్‌లో 11వ పీఆర్సీ ప్రకారం రూ. 9900 కోత పడింది. దీనిపై ఏబీఎన్ వరుస ప్రసారాలతో పే ఫిక్సేషన్‌ వెంటనే చేసి.. 11వ పీఆర్సీ ప్రకారం పెన్షన్ వేయాలని ఉన్నతాధికారుల ఆదేశించింది. మళ్లీ పే స్లిప్పులను సరిచేసి అధికారులు జనరేట్ చేశారు. 

‘కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు పెరుగుతాయి. తగ్గవు’ అని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రకటనలు అసత్యమని రుజువైంది. జనవరి నెలకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన పెన్షన్‌ పే స్లిప్‌ను ఉద్యోగులు బయటపెట్టారు. దీని ప్రకారం... రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ ఒకరికి డిసెంబరు పెన్షన్‌తో పోల్చితే జనవరి పెన్షన్‌ ఏకంగా రూ.5712 కోత పడింది. ఇదే విధంగా ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా తగ్గుతాయని చెబుతున్నారు. పే స్లిప్‌లు అందుబాటులోకి వచ్చాక అసలు విషయం బయటపడుతుందని, ‘రివర్స్‌ పీఆర్సీ’ నిజమని తేలుతుందని పేర్కొంటున్నారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌(ఏక్యూపీ) ప్రయోజనాలు అందుకుంటున్న వారికి, ఆ మొత్తం ప్రయోజనాలను స్థూల పెన్షన్‌లో మినహాయించి, ప్రత్యేక సాయం పేరుతో అందజేస్తామని సీఎస్‌ కమిటీ పేర్కొంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top