పాన్‌కార్టులో పేరు, పుట్టిన తేదీని ఎలా సరిచేయాలి...?
ముందుగా ఎన్‌ఎస్‌డిఎల్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
✅ ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ పేజిలో Application Typeపై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్షన్ ఎంచుకోవాలి.
✅ ఆ తర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
✅ కొత్త పేజిలో టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి.
✅ Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
✅ దాని తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసి వ్యక్తిగత వివరాలను నింపి Next బటన్ మీద క్లిక్ చేయాలి.
✅ అందులో మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్రస్‌ను తప్పులు లేకుండా నింపాలి.
✅ మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని మార్చాలని అనుకున్నా దీనిలో మార్చుకోవచ్చు.
✅ అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని సరిగ్గా ఇచ్చిన తర్వాత పేజి కింద ఉన్న next బటన్ క్లిక్ చేయాలి.
✅ ఆ తర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
✅ అలాగే ఫొటో, సంతకం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మట్‌లో అప్‌లోడ్ చేయాలి.
✅ అనంతరం సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
✅ అప్లికేషన్ సబ్‌మిట్ కాగానే అకనాలెడ్జ్‌మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఫోన్ నెంబర్‌కు, మెయిల్‌కు మెస్సెజ్ కూడా వస్తుంది.
✅ అనంతరం ఆ స్లిప్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
✅ ఆ తర్వాత అప్లికేషన్‌ను ప్రింట్ తీసి, మీరు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసిన వాటిని ఎన్‌ఎస్‌డిఎల్ ఆఫీస్ : Building-1, 409-410, 4th Floor, Barakhamba Road, New Delhi, PIN: 110001)) కు పంపించాలి.
0 Post a Comment:
Post a Comment