Tuesday 21 December 2021

ఉద్యోగ సంఘాలతో నేడు మళ్లీ చర్చలు - సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ సారథ్యంలో సమావేశం - ప్రధాన అజెండా పీఆర్సీ.

ఉద్యోగ సంఘాలతో నేడు మళ్లీ చర్చలు - సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ  సారథ్యంలో సమావేశం - ప్రధాన అజెండా పీఆర్సీ.



పీఆర్సీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపనుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల నేతలంతా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆర్థిక శాఖలోని సర్వీసెస్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ సమాచారం పంపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారులతో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించే ఈ సమావేశంలో శాఖలవారీగా అంశాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించనుంది. పీఆర్సీపై ఇప్పటికే అధికారుల కమిటీతో సమీక్షించిన సీఎం.. మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రతిపాదనలు తీసుకురావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరుగనుంది. ఈ సంద ర్భంగా మంగళవారం సాయంత్రం పచివాల యంలో ఐక్య జేఏసీ నేతలు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ మానవ వనరుల విభాగం ఈమాషణను కలిసి తమ డిమాండ్లను గుర్తు చేస్తూ వినతిపత్రం అందజేశారు.

తెలంగాణా కంటే మెరుగైన పీఆర్సీ : బండి శ్రీనివాసరావు

తెలంగాణా కంటే మెరుగ్గానే పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నట్టు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎన్ సమీర్ శర్మ, ఆర్థిక కార్యదర్శి శశిభూషన్ ను కలిసిన అనంతరం మీడియాతో బండి మాట్లాడుతూ, ఉద్యోగుల డిమాండ్లపై కార్యదర్శుల సమావేశం బుధవారం నిర్వహిస్తామని ప్రభుత్వం సమాచారం పంపిందని స్పష్టం చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తులకు సంబంధించిన అంశాలపై సమాచారం. ఇచ్చేందుకు సచివాలయంలో ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను కలిశామని వెల్లడించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సీఆర్సీ ఆంకాలపై జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో అంశాల వారీగా చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారని అయితే ఆ ప్రకటన రాదని తెలిసి నిరాక చెండామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇస్తున్న 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టుగా సజ్జలు తెలిపారు. న్నారు. సీఎం జగన్ ఉద్యోగులకు మంచి చేస్తారనేసం పూర్ణ విశ్వాసం ఉందన్నారు. సీఎం జన్మదినం సంద ర్భంగా పీఆర్సీపై నిర్ణయం ప్రకటిస్తారని ఉద్యోగు లంతా ఎదురు చూశారని జేఏసీ నేత బండి శ్రీనివాసా రావు అన్నారు.

సీఎంతో చర్చలకు పిలవాలి : బొప్పరాజు

అపోహలకు తావులేకుండా సీఎం వద్ద చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నామని జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే కార్యదర్శుల సమావేశంలో 71 డిమాండ్లపై చర్చించాలని కోరినట్లు స్పష్టం చేశారు.ఉద్యోగులకు బకాయి పడిన 1600 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. నిలుపుదల చేసిన 3 డీఏ బకాయిలను కూడా తక్షణం విడుదల చేయాల్సిందిగా మరోమారు ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యల వల్ల జీతాలు తగ్గుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతశివారెడ్డి మాట్లాడారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top