Tuesday 21 December 2021

పరీక్షా కాలమే...ఒడుదొడుకుల మధ్య విద్యాసంవత్సరం. కరోనా రెండో దశ ఉద్ధృతితో విద్యార్థులకు నష్టం.

 పరీక్షా కాలమే...ఒడుదొడుకుల మధ్య  విద్యాసంవత్సరం. కరోనా రెండో దశ  ఉద్ధృతితో  విద్యార్థులకు నష్టం.




విద్యారంగంపై 2021లో కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఏప్రిల్‌ నుంచి రెండో దశ ఉద్ధృతి కారణంగా జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు వ΄తపడ్డాయి. మహమ్మారి బారినపడి పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు మృత్యువాత పడ్డారు. పది, ఇంటర్‌ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పైతరగతులకు వెళ్లారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ ద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారు. వైరస్‌ ప్రభావం తగ్గాక ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ఆరంభంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారినపడి ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.

కరోనా మొదటి దశ ఉద్ధృతి కారణంగా 2020-2021 విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు నష్టపోయారు. రెండో దశ ఉద్ధృతి కారణంగా మరలా విద్యాసంస్థలు వ΄తపడ్డాయి. ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్లో తరగతులు నిర్వహించారు. ల్యాప్‌ట్యాప్‌ల కొనుగోలు, అంతర్జాల కనెక్షన్ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడింది. ఆగస్టులో తరగతులు మళ్లీ ప్రారంభమైనా కొన్ని రోజులపాటు కొవిడ్‌ ఆందోళన వెంటాడింది. అయినా కొందరు ఆన్‌లైన్‌ తరగతులపైనే ఆధారపడ్డారు.

పారిశ్రామిక శిక్షణకు దూరం...

ఇంజినీరింగ్, ఏజీ బీఎస్సీ, ఏజీ బీటెక్, ఫుడ్‌సైన్స్‌ విద్యార్థులు పారిశ్రామిక శిక్షణకు వెళ్లలేకపోయారు. క్షేత్రస్థాయిలో పూర్తిగా పనిచేయకపోవటంతో తగిన అనుభవం గడించలేదు. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంలో ఊగిసలాట ధోరణి కనపరచటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. హైకోర్టు తీర్పుతో చివరికి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు పంపించటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్‌లో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని రెండో ఏడాది మార్కులు ఇచ్చారు.

ఆందోళన పెట్టిస్తున్న  ఒమిక్రాన్‌...

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి విద్యా శాఖ వర్గాలు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. వ΄డో దశ ఉద్ధృతి వస్తే మరోసారి విద్యాసంస్థలను వ΄సివేసే పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. విలువైన విద్యా సంవత్సరం మళ్లీ నష్టపోతామని వాపోతున్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ రెండో డోసుల టీకా పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. కళాశాలల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించి విద్యార్థులకు టీకా వేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నూరుశాతం రెండో డోసుల వ్యాక్సిన్‌ వేసుకునేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది విద్యా రంగం ఒడుదొడుకుల మధ్యే సాగింది.

అన్నీ ఆలస్యంగా...

కొవిడ్‌ కారణంగా విద్యాసంవత్సరం వెనక్కిపోయి విద్యార్థులు నష్టపోయారు. ఎంసెట్, నీట్ పరీక్షలు సకాలంలో నిర్వహించలేదు. ఆగస్టు, సెప్టెంబరులో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి అక్టోబరు నాలుగో వారమైంది. ఇంజినీరింగ్‌ మొదటి, రెండో కౌన్సెలింగ్‌ ముగిసి విద్యార్థులకు ఇటీవల సీట్లు కేటాయించారు. పలు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు మాత్రం ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత కళాశాలలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు నవంబరులో, మొదటి సంవత్సరం విద్యార్థులకు డిసెంబరులో పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేటలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల భవనాల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ఏడాది పనులు పూర్తి కాలేదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top