Saturday, 18 December 2021

పుస్తకాల సంఖ్య తగ్గించాలి

 పుస్తకాల సంఖ్య తగ్గించాలి 



చరిత్ర పుస్తకాలను నవీకరించాలి.

ప్రాంతీయ భాషల్లోనూ SCERT పుస్తకాలు

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక


పుస్తకాల సంఖ్యను, పాఠ్యాంశాలను తగ్గించి పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగు బరువు తగ్గించాలని 'విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడల' అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. బిజెపి ఎంపి | వినయ్ పి సహస్రబుద్దే నేతత్వంలోని ఈ కమిటీ పాఠ్యాంశాలతో పాటు పలు ప్రతిపాదనలను సూచించింది చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేసి నవీకరించాలని కూడా పేర్కొంది.

కమిటీ ప్రతిపాదనలు :

• పాఠ్యపుస్తకాలను నాణ్యమైన ప్రమాణాలలో అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పనలో బహుళ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని, విద్యార్థుల స్వీయ అధ్యయనానికి వీలుగా పుస్తకాలతో పాటు చిత్రాలు, గ్రాఫిక్స్, ఆడియో-విజువల్ సామాగ్రిని ఉపయోగించాలని కమిటీ తెలిపింది.

• పాఠ్యాంశాలలో వివిధ వత్తులలో మహిళలకు సంబంధించిన విషయాలను, స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర గురించిన వివరాలు సముచితంగా పొందుపర్చాలని పేర్కొంది.

ప్రధానంగా చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మార్పులు చేర్పులు చేయాలి. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో పలువురు చారిత్రక వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధులను దోషులుగా చిత్రీకరించారనీ, వాటిస్థానంలో రాజవంశాల ఘనకీర్తిని, 1947 తర్వాత చరిత్ర, ప్రపంచ చరిత్ర అంశాలు చేర్చాలని కమిటీ సూచించింది.

• డ్రగ్స్, ఇంటర్నెట్ వ్యసనాలతో పాటు సమాజానికి చేటు కల్గిస్తున్న ఇతర అంశాల గురించి విద్యార్థులకు అవగాహన పెంచే పాఠ్యాంశాలను చేర్చాలని కమిటీ పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఏకాత్మిక్' పుస్తకం తరహాలో అన్ని సబ్జెక్టులను ఒకే పుస్తకంలో చేర్చి ప్రాథమిక తరగతుల పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించాలని పేర్కొంది.

• జాతీయ విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎసిఇఆర్), రాష్ట్రస్థాయి విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎస్సిఈఆర్టీ) రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ప్రచురించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసిఎస్ఇ), స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డుల ద్వారా అమలు చేయడానికి వివిధ సబ్జెక్టుల కోసం కోర్ క్లాస్ వారీగా ఉమ్మడి సిలబస్ను అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పేర్కొంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top