ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అమలుకు ఆదేశాలివ్వండి
ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలతో పా టు అన్ని ఉత్తర్వులు తెలుగులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకో ర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. అధికార భాషా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో సీఎస్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ యువజన అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై ఈ వారంలోనే సీజే ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment