Wednesday 26 May 2021

కరోనా నుంచి కోలుకున్న వారికి మరో కొత్త సమస్యలు వస్తున్నాయి. నిర్లక్ష్యం వద్దు...

 కరోనా నుంచి కోలుకున్న వారికి మరో కొత్త సమస్యలు వస్తున్నాయి. నిర్లక్ష్యం వద్దు...



కొంతమంది వ్యక్తులు కరోనా లాంగ్ హాలర్లుగా మారవచ్చు, కొంతమంది, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తలు అవసరమయ్యే వైద్య పరిస్థితులను అభివృద్ధి చేయవచ్చు. ఉదాహరణకు, COVID-19 నుండి కోలుకున్న రోగులలో గుండెపోటు పెరిగినట్లు అనేక నివేదికలు ఉన్నాయి. కొంతమందిలో కొత్తగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరి కొంతమందిలో వైరస్ ద్వారా కిడ్నీ దెబ్బతినవచ్చు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.

మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్ వ్యాధిని గుర్తించమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు మూసుకుపోవడం..దీంతో ఆ భాగానికి ప్రాణవాయువు, పోషకాల సరఫరా నిలిచిపోవడం ఈ వ్యాధి లక్షణం. గ్యాంగ్రీన్ వ్యాధిని త్వరగా గుర్తించకపోతే.. మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు గుజరాత్ లో బయటపడ్డట్లు తెలుస్తోంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top