Wednesday 26 May 2021

బ్లాక్‌ఫంగస్‌ మందు.. మాకే ముందు!

బ్లాక్‌ఫంగస్‌ మందు.. మాకే ముందు!






రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్యకు తగ్గట్లు యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్ల సరఫరా జరగకపోవటంతో వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. పలు ఆసుపత్రుల్లో బాధితులు అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నందున తమకే తొలుత ఇంజక్షన్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పరిమితంగా వచ్చిన ఇంజక్షన్లను వీరికి ఎలా సరిపెట్టాలన్న దానిపై ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య నిపుణులు తర్జనభర్జనలు పడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం 13 జిల్లాల్లో కలిపి 252 మంది బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్నారు.  కేంద్రం నుంచి తొలివిడత కింద కేవలం 575 వయల్స్‌ మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. బాధితుడి బరువు అనుసరించి కిలోకు 5 మిల్లీగ్రాముల (ఎంజీ) ఇంజక్షన్‌ ఇవ్వాలి. ఇలా రోజుకు ఆరు ఇంజక్షన్ల చొప్పున రోగి ఆరోగ్యస్థితిని బట్టి పది రోజుల నుంచి మూడు వారాలకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడి మెదడుకు ఫంగస్‌ చేరితే అతని శరీరబరువు కిలోకు పది ఎంజీ ఇవ్వాలి. మూత్రపిండాలు, కాలేయం పనితీరు, ఎలక్ట్రోలైట్స్‌ (రక్త పరీక్ష) నివేదిక ఆధారంగా ఈ డోసులో మార్పులు జరుగుతుంటాయి.

* విశాఖలో 33 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడికి 77 ఇంజక్షన్లు కేటాయించారు. వీరికి రోజుకు ఆరు ఇంజక్షన్ల చొప్పున ఇవ్వాలంటే.. ఒక్కరోజుకే 198 కావాలి.


* తిరుపతి రుయాలో 21, స్విమ్స్‌లో 12 మంది బాధితులు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు 57 ఇంజక్షన్లు పంపించారు.


* విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు 40 మంది. ఇక్కడికి 55 ఇంజక్షన్లు వెళ్లాయి.


* గుంటూరు జీజీహెచ్‌లో 63 మంది బాధితులుంటే ఆ జిల్లాకు అందినవి 50 వరకు ఇంజక్షన్లు. ఒంగోలు జీజీహెచ్‌లో 32 మంది బాధితులుండగా ప్రకాశం జిల్లాకు 30 ఇంజక్షన్లు కేటాయించారు. వీరందరికీ ఇంజక్షన్లు చేయాలంటే ఒక్కడోసుకు కూడా ఇవి సరిపోవు.

తీవ్రత ఎక్కువ ఉన్నవారికే ముందు

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇంజక్షన్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పొసకనాజోల్‌ ఇంజక్షన్లు, మాత్రలు ఇవ్వడం వల్ల కొరత సమస్యను తాత్కాలికంగా అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కంటిచూపు తగ్గడంతోపాటు మెదడు వరకు ఫంగస్‌ వ్యాపించినవారికి తొలుత ఇంజక్షన్‌ను ఇస్తామన్నారు. తలనొప్పి, కన్ను బరువుగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ మందులు ఉపయోగిస్తున్నామని చెప్పారు. వీరికి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు నిర్వహించి, తీవ్రతను అనుసరించి బాధితులకు చికిత్సలో ప్రాధాన్యం ఇస్తామన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top