Wednesday 26 May 2021

Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

 Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

Source: tv9 telugu
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా బయటకు రాకూడదని అధికారులు వెల్లడించారు. ఒకవేళ వచ్చినా నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

బయటి పనులకు వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేసుకోండి...

• మీరు అవసరమైన పనుల కోసం బయట తిరగవలసిన సందర్భాలను వీలైనంత వరకు తగ్గించుకోండి

• అత్యవసర సందర్భాల్లో బయటకు వెళ్ళాల్సి వచ్చినట్టయితే ఇతరులకు మీకు మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేట్లు చూసుకోండి

• షాపింగ్ చేసేటప్పుడు బండ్లు లేదా బుట్టలకు ఉన్న హ్యాండిల్స్ తుడవడం చేయకండి

• వీలైనంత వరకూ చేతికి గ్లౌజులు వేసుకోండి.. ముఖానికి మాస్కు ధరించండి.

• మీరు బయటికి వచ్చినప్పుడు తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోండి. మీ ముఖాన్ని తాకకుండా జాగ్రత్తగా ఉండండి.

బయట నుండి మీరు ఇంటికి తిరిగి వచ్చాక...

• మీ చేతులను సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోండి

• మీరు బయటకు తీసుకెళ్లిన బాక్సులను, ప్యాక్ చేసిన ఆహారాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి శానిటైజ్ చేయండి.

• మీరు బయట నుండి తీసుకువచ్చిన ఉత్పత్తులను, వస్తువులను వంటగదిలో ఉంచే ముందు వాటిని బాగా కడగాలి. ఒకవేళ నీటితో కడగలేనివి అయితే వాటిని ఎవరూ తాకని ప్రదేశంలో ఉంచండి.

వైరస్ రహితం చేసుకోవడం…

• మీరు బయటి నుంచి వచ్చిన తర్వాత తాకిన ప్రతిదాన్ని అంటే డోర్ నాబ్స్ , లైట్ స్విచ్లు, తాళం చెవిలు, ఫోన్, కీబోర్డులు, రిమోట్లు మొదలైనవి శానిటైజ్ చేయండి.

• పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ఆమోదించిన క్రిమిసంహారక మందులనే వాడండి

మీకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వస్తువుల డెలివరీ విషయంలో ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో మీకు ఏదైనా ఆన్లైన్‌లో పార్సిల్ వస్తే.. ఆ వస్తువులను ఇంటి గుమ్మంలో లేదా మీ కాంప్లెక్స్ ప్రాంతంలోనే ఉంచమని సంబంధిత వ్యక్తులను అడగండి.

• సాధ్యమైనంత వరకు ఇలాంటి లావాదేవీలన్నీ ఆన్లైన్లో చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోండి.

• డబ్బులు చెల్లించాల్సి ఉంటే.. వారు మీ దగ్గరకు రావాల్సి వచ్చినప్పుడు వారిని మీ ఇంటి తలుపులకు ఆరు అడుగుల దూరంలో ఉంచండి.

• ఒకవేళ మీకు ఉత్తరాలు, ఇతర పార్సిల్స్ ఏవైనా వస్తే వాటిని తీసుకున్న తర్వాత మీ చేతులును శుభ్రముగా కడుక్కోండి.

మన ఇంటికి అతిథులు వచ్చిన సందర్భాల్లో…

• ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అతిథులను ఇంటికి పిలవకపోవడమే మంచిది.

• ఒకవేళ బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చినా.. వారు మీ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంటే, వీలైనంత వరకు ఒకే రూమ్‌లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

• మీరు, మీ ఇంటికి వచ్చినవారు ఒకే రూంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటే కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోండి.

మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే…

• మొదట మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి

• అనారోగ్యానికి గురైనవారు వాడిన వస్తువులను, ఆ వ్యక్తిని వేరే రూమ్‌లోకి మార్చండి.

• ప్రతిరోజూ వారు తరచుగా తాకిన వస్తువులను శానిటైజ్ చేయండి

• వివిధ వస్తువులను వారితో పంచుకోవడం మానుకోండి

• వాషింగ్ మెషిన్ కడిగి శుభ్రం చేసిటప్పుడు చేతికి గ్లౌజులు ధరించండి

• మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం మంచిది

• అనారోగ్యానికి గురైనవారు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

• రెడీమేడ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, రొట్టెలు, పాస్తా, కూరగాయలు, పండ్లు అవసరమైన మేరకు నిలువ చేసుకోవాలి.

• బయటి నుంచి తెచ్చుకున్న కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.


పైన పేర్కొన్న జాగ్రత్తలు ప్రతీ ఒక్కరూ పాటిస్తే కరోనా వ్యాప్తిని నివారించడానికి సాధ్యపడుతుందని ఏపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top