Sunday 18 April 2021

ప్రపంచ వారసత్వ దినోత్సవం

 ప్రపంచ వారసత్వ దినోత్సవం 




 ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18 న విశ్వవ్యాప్తంగా జరుపుకుంటారు.


  ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన మరియు వాటి సంరక్షణ ఆవశ్యకతను తెల్పడం కోసం యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.

  2014 సంవత్సర ప్రపంచ వారసత్వ దినోత్సవ థీమ్ - హెరిటేజ్ ఆఫ్ కాంమెమోరేషన్ (Heritage of Commemoration)

  ఈ రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

  ఐక్యరాజ్య సమితి 1972 తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు. పురాతన కట్టడాలు, స్థలాలు గురించి అధ్యయనం చేయడం వాటి పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం మొదలైన అంశాలు ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు.

  యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత్ నుండి స్థానం సంపాదించిన ప్రదేశాలు (30)

సాంస్కృతిక ప్రదేశాలు (24)

1. ఆగ్రా కోట (1983)

2. అజంత గుహలు (1983)

3. ఎల్లోరా గుహలు (1983)

4. తాజ్ మహల్ (1983)

5. కోణార్క్ సూర్య దేవాలయం (1984)

6. మహాబలిపురం వద్ద గల కట్టడాల సముదాయం (1984)

7. గోవా చర్చులు మరియు కాన్వెంట్లు (1986)

8. ఫతేహ్పూర్ సిక్రీ (1986)

9. హంపి వద్ద గల కట్టడాల సముదాయం (1986)

10. ఖజురహో కట్టడాలు (1986)

11. ఎలిఫంటా గుహలు (1987)

12. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ (1987)

13. పట్టడకళ్ కట్టడాల సముదాయం (1987)

14. సాంచిలోని బౌద్ధ కట్టడాలు (1989)

15. హుమయూన్ టూంబ్ (1993)

16. ఖుతుబ్ మినార్ కట్టడాలు (1993)

17. మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా (1999)

18. బోధ గయాలోని మహాబోధి ఆలయ సముదాయం (2002)

19. భింబెట్కా రాతి గృహాలు (2003)

20. చంపానేర్ పవాగాద్ ఆర్కియాలజికల్ పార్క్ (2004)

21. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) (2004)

22. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ (2007)

23. జైపూర్ జంతర్ మంతర్ (2010)

24. రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ (2013)

సహజసిద్ధమైన ప్రదేశాలు (6)

1. కాజీరంగా జాతీయ పార్క్ (1985)

2. కియోలాడియో జాతీయ పార్క్ (1985)

3. మానస్ వన్యప్రాణి సంరక్షణాలయము (1985)

4. సుందర్బన్స్ జాతీయ పార్క్ (1987)

5. నందాదేవి మరియు వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ (1988)

6. పశ్చిమ కనుమలు (2012)

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top