Sunday, 18 April 2021

కరోనా వైరస్ కొత్త లక్షణాలు - ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు

కరోనా వైరస్ కొత్త లక్షణాలు - ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు
  దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రోజువారీగా 2లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. 

  ఇటు మన రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలుగా భావించేవాళ్లం. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కొత్త లక్షణాలు వెలుగు చూస్తున్నాయి. 

  ముఖ్యంగా తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌ ఎక్కువగా వస్తోందని గుర్తించారు. కనుగుడ్డు నుంచి కూడా వైరస్‌ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవే కాకుండా కీళ్లనొప్పులు, మైయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా వెలుగు చూస్తున్నాయి.

  అందువల్లే ఫస్ట్ వేవ్ కంటే మరింత వేగంగా కరోనా విస్తరిస్తోంది. ప్రజలు కూడా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉండడం వల్ల వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతోంది. 

  ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రెండో వేవ్ లక్షణాలు పూర్తిగా మొదటి దానితో సమానంగా ఉండవు. జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో శాస్త్రవేత్తలు కొత్త జాబితాను రూపొందించారు. కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 

కళ్లు ఎర్రబడడం:

  కళ్లు ఎర్రబడడం లేదా కండ్లకలక అనేది అనేక వైరల్ ఇన్ఫెక్షన్లకు సంకేతం. అయితే దీనిలో కళ్లు ఎర్రగా, వాపుగా ఉండడంతోపాటు కంటి నుంచి నీరు వస్తుంది. చైనాకు చెందిన ఓ అధ్యయనం ప్రకారం కొత్త స్ట్రెయిన్ వైరస్ బారినపడిన వారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కళ్లు ఎర్రబడడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది.

జీర్ణ సంబంధిత సమస్యలు:

  కరోనా సంక్రమణ ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, వికారం మరియు నొప్పి అనేది కరోనా వైరస్ యొక్క సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ వ్యవస్థను ఎదుర్కొంటుంటే.. దాన్ని తేలికగా తీసుకోకండి. వెంటనే టెస్ట్ చేయించుకోండి.

బ్రెయిన్ పనితనం తగ్గడం:

  కరోనా వైరస్ అనేది జ్ఞాపకశక్తి లేదా మొదడుకు సంబంధించిన సమస్యలను కలగజేస్తుంది. గందరగోళంగా ఉండడం లేదా విషయాలను గుర్తించుకోవడంలో ఇబ్బంది కూడా కరోనా సమస్యకు సంకేతం. ఈ లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

అసాధారణ దగ్గు:

  కరోనా వైరస్ యొక్క సాధారణ లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఆ ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే.. అధి సాధారణ దగ్గుని పోలి ఉండదు. దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుంది మరియు మీ వాయిస్ కూడా మారుస్తుంది.

వినికిడి బలహీనత:

  ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా వినికిడి సమస్యలకు దారితీస్తుంది. 56 అధ్యయనాలు చేసిన అనంతరం కరోనా శ్రవణ, వెస్టిబ్యులర్ వ్యవస్థకి సంబంధించిన సమస్యలను సృష్టించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

సాధారణ లక్షణాలు:

  కరోనా యొక్క సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన మరియు రుచి కోల్పోవడం, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కొత్త లక్షణాలతో సహా ఈ లక్షణాలను మీలో గమనించినట్టయితే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవడం మంచిది.

  కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలోనే మనకు టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 

  అయితే ప్రస్తుతానికి అందరికీ టీకాలు అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. 

  ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించడం, ఇతరులతో భౌతిక దూ  రం పాటించడం, సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం, తిరిగి ఇంటికి రాగానే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.

  ఒకవేళ పైన సూచించిన లక్షణాలు ఉన్నట్టయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. డాక్టర్ అర్జా శ్రీకాంత్

స్టేట్ నోడల్ అధికారి, కొవిడ్-19

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top