ఏటా 20 ఈఎల్‌లు వాడేసుకోవాలి - 10 ఆర్జిత సెలవులే దాచుకోవచ్చు : ఏడో వేతన సంఘం సిఫారసు - త్వరలో సర్క్యులర్.
ఆర్జిత సెలవుల (ఎర్న్‌డ్ లీవుల) నిబంధనలు త్వరలో పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వోద్యోగి ఇక నుంచి ఏటా తనకు వచ్చే ఆర్జిత సెలవుల్లో (ఈఎల్స్) 20 సెలవులను తప్పనిసరిగా వాడేసుకోవాలని, కేవలం పది సెలవులను మాత్రమే అట్టేపెట్టుకోవాలని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది. అంటే ఉద్యోగికి ఏటా వచ్చే 30 ఆర్జిత సెలవుల్లో పది సెలవులు మాత్రమే తదుపరి ఏడాదికి కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇంతకాలం.. ఆర్జిత సెలవులను ఇకపై 300 రోజుల వరకూ మాత్రమే దాచుకోడానికి (ఎక్యుములేట్ చేసుకోడానికి) అనుమతి ఇచ్చేలా నిబంధనలను సవరించాలని వేతనసంఘం సూచించింది.
ఉద్యోగి తనకున్న సీఎల్స్‌కు ఒకట్రెండు ఈఎల్స్ జోడించి- వాటికి వారాంతపు సెలవులు కలుపుకొని -లాంగ్‌లీవు మీద వెళ్లేట్లు ప్లాన్ చేసుకుంటున్నారనీ, ఈ పద్ధతికిక స్వస్తి పలకాలనీ కూడా సూచించింది. సీఎల్స్‌తో ఈఎల్స్‌ను కలిపే నిబంధనలు కూడా సవరించాలని పే కమిషన్ కోరుతోంది.
‘‘దాని పేరులోనే ఉన్నట్లు పెయిడ్ లీవ్ లేదా ఎర్న్‌డ్ లీవ్ అంటే ఉద్యోగి తాను చేసిన సేవలకు పొందే సెలవు. దీన్ని గిఫ్ట్‌గా చూడరాదు. ఒక ఉద్యోగి (ఆర్జిత) సెలవు తీసుకొని పునరుత్తేజితుడైతే ఇంకా బాగా పనిచేయగలడనీ, తద్వారా పనిచేస్తున్న సంస్థకు నాణ్యమైన ఔట్‌పుట్ వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. చాలా ప్రభుత్వేతర సంస్థలు ఇప్పటికే ఈ నిబంధన అమలు చేస్తున్నాయి.
ప్రభుత్వ రంగంలో మాత్రం ఇంకా జరగడం లేదు. కంపల్సరీగా తీసుకొనేట్లు త్వరలోనే ఓ సర్క్యులర్ వెలువడుతుంది’’ అని వేతన సంఘం వెల్లడించింది.
0 Post a Comment:
Post a Comment