Thursday 4 April 2024

మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలి ? ఎందుకు నిర్వహించాలి ?

మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలి ? ఎందుకు నిర్వహించాలి ?



ఎన్నికలకు వినియోగించే యంత్రాలు ఎటువంటి ట్యాంపరింగ్ కాలేదని సక్రమంగా పనిచేస్తున్నాయని రాజకీయ పార్టీల తరఫున పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉండే పోలింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు వారి సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలి.

• ఎప్పుడు నిర్వహించాలి?

ఉదయం 5:30 గంటలకు. నిర్ణిత సమయం 90 నిమిషాలు

• పోలింగ్ ఏజెంట్లు 5 గంటల 30 నిమిషాలకు అందుబాటులో లేకపోతే మాక్ పోలింగ్ మానేయొచ్చా ?

• పోలింగ్ ఏజెంట్ల కోసం మరో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. అప్పటికి కూడా రాని పక్షంలో ఐదు గంటల 45 నిమిషాలకు జోనల్ ఆఫీసర్ కి సమాచారం అందించి మాక్ పోలింగ్ నిర్వహించాలి.

• 5:45 తదుపరి ఏజెంట్లు అందుబాటులో లేరని మాక్ పోలింగ్ నిర్వహణ వాయిదా వేయకూడదు లేక మానివేయరాదు.

• ఇది కచ్చితంగా నిర్వహించవలసిన అంశంగా గమనించండి.

• మాక్ పోల్ లో కనీసం 50 ఓట్లు వేయించాలి.

• తదుపరి C R C పాటించాలి.

-Close

-Result

-Clear

మాక్ పోల్ అయిన తదుపరి CLOSE చేయడం, RESULTS చూపడం, ఆఖరున కంట్రోల్ యూనిట్ నందు CLEAR చేయడం తప్పనిసరి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top