GUIDELINES OF TOEFL EXAMINATION
1. టోఫెల్ రెడీనెస్టె టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసి డి సి ఇ బి లకు అందచేసిన జాబితాలోని పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు ఏప్రిల్ 10వ తేదిన మరియు 6, 7, 8, 9 తరగతులకు ఏప్రిల్ 12 తేదిన నిర్వహించబడును.
2. జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు, రోల్ వివరాలు ఇవ్వబడినవి.
3. డి సి ఇ బి లు పాఠశాలలో విద్యార్దుల వాస్తవ సంఖ్య ఆధారంగా ప్రశ్న పత్రాలు ఆయా పాఠశాలకు అందించవలెను.
4. 3, 4, 5 తరగతులకు ఒక ప్రశ్న పత్రము , 6, 7, 8, 9 తరగతులకు మరొక ప్రశ్న పత్రము ఇవ్వబడును.
5. రీడింగ్, లిసనింగ్ విభాగాలలో ప్రశ్నలు ఉండును.
6. ప్రీ ప్రింటెడ్ ఓ ఎం ఆర్ పై విద్యార్ధులు తమ సమాధానాలను బబుల్ చేయవలెను (సి బి ఏ లలో మాదిరిగానే )
7. లిజనింగ్ కి ఆడియో క్లిప్స్ IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ లలో రాష్ట్ర స్తాయి నుంచి IT సెల్ వారిచే పరీక్ష రోజు పంపబడును.
8. ఆయా పాఠశాలల్లో IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ కు ఏమైనా రిపేర్ ఉంటె ముందుగానే రిపేర్ చేయించుకొనవలెను.
9. డి సి ఇ బి లు DNO (IT) లు సమన్వయము తో వ్యవహరించవలెను.
10. పరీక్ష నిర్వహణకు టోఫెల్ మాన్యువల్ లో సూచించిన రూమ్స్ అలోట్ మెంట్ సీటింగ్ అరేంజ్ మెంట్ విధానం పాటించాలి.
11. టోఫెల్ మాన్యువల్ ప్రతి టీచర్ చదివేలా సాఫ్ట్ కాపీ షేర్ చేయవలెను. సంబందిత నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెను.
12. ప్రశ్న పత్రాలు విద్యార్ధులకు తిరిగి ఇవ్వరాదు. USED/ UNUSED ప్రశ్న పత్రాలు తిరిగి పాఠశాలల నుంచి డి సి ఇ బి కి తెప్పించవలెను. తదుపరి సూచనల వరకు వాటిని సీల్ వేసి భద్రపరచవలెను.
13. ఓ ఎం ఆర్ లు సి బి ఏ తరహాలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి డి సి ఇ బి కి తెప్పించి తదనంతరం స్కానర్ కి అందించవలెను.
14. ఓ ఎం ఆర్ లో కుడి చేతి వైపు ఉన్న ఫారం కోడ్ /స్కూల్ యూస్ ఓన్లీ అని ఉన్న బాక్స్ లో ఫిల్ చేయనవసరం లేదు.
15. ప్రీ ప్రింటెడ్ ఓ ఎం ఆర్ రాని లేదా ఓ ఎం ఆర్ పాడైన విద్యార్ధులకు బఫర్ ఓ ఎం ఆర్ లలో నేమ్, యూ డైస్ కోడ్ / స్టూడెంట్ ఐడి / క్లాస్ తదితర వివరాలు ఫిల్ చేయవలెను.
16. టీచర్ అటెండన్స్ యాప్లో ఓ ఎం ఆర్ స్కానింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుతుంది. దాని ద్వారా ఆన్లైన్ అటెండన్స్కో సం ఓ ఎం ఆర్ స్కాన్ చేయవలెను.
0 Post a Comment:
Post a Comment