Sunday 10 March 2024

పాఠశాల సామాజిక తనిఖీ శిక్షణా కరదీపిక - Social Audit Training Manual & Social Audit Mobile Application

పాఠశాల సామాజిక తనిఖీ శిక్షణా కరదీపిక (Social Audit Training Manual),  Social Audit Mobile Application and Instructions.



సోషల్ ఆడిట్ గురించిన సూచనలు.

ఇది అన్ని ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల వారు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనిగా భావించాలి.

@ ఇది ప్రైవేటు, ఎయిడెడ్ వారికి మినహాయింపు. కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ వారు కూడా చేయవలెను.

@ ఇందులో డేటా మొత్తం ప్రస్తుత అకడమిక్ ఇయర్ కి సంబంధించినది ఎంటర్ చేయాలి.(2023-24).

@ ముందుగా గ్రూపులో మీకు పంపినటువంటి లింకు క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేయాలి.

@ గత సంవత్సరం చేసినటువంటి యాప్ మీ మొబైల్ లో ఉంటే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు పంపిన లింకు నుంచి కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

@ ఇప్పుడు యాప్ ఓపెన్ చేయగానే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

@ దీనికోసం మొదట click on------not registered yet?

@ ఇప్పుడు ఎంటర్ యు డైస్ వద్ద మన స్కూలు డైస్ కోడ్ ఎంటర్ చేయాలి.

@ ఎంటర్ నేమ్ వద్ద హెచ్ఎం నేమ్ ఎంటర్ చేయాలి.

@ ఎంటర్ మొబైల్ నెంబర్ వద్ద హెచ్ఎం నంబర్ ఎంటర్ చేయాలి.

@ ఎంటర్ ఈమెయిల్ వద్ద పాఠశాల లేదా హెచ్ఎం ఈమెయిల్ ఎంటర్ చేయాలి.

@ ఎంటర్ పాస్వర్డ్ వద్ద మనం ఈ యాప్ కోసం ఏ పాస్వర్డ్ ని సెట్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ ఎంటర్ చేయాలి.

@ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. (పాస్వర్డ్ లో కచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ ఉండేలా చూసుకోవాలి).

@ ఇప్పుడు ఎంటర్ క్యాప్చ వద్దా అక్కడ ఉన్నటువంటి క్యాప్చ ఎంటర్ చేయాలి.

@ ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి.

# ఇంతటితో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది.

@ తరువాత ఇప్పుడు మనకు ఒక బాక్స్ లో ఎంటర్ మెయిల్ ఐడి వద్ద ఇదివరకు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ని ఇక్కడ ఎంటర్ చేయాలి.

@ తరువాతి బాక్సులో పాస్వర్డ్ వద్ద ఇదివరకు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.

@ ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి.

@ ఇప్పుడు మనకు ఒక బాక్స్ లో మన పాఠశాల డైస్కోడ్ కనిపిస్తుంది.

@ దాని కింద నెక్స్ట్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి.

@ ఇప్పుడు మనకు, ఎన్యుమరేటర్ నేమ్ వద్ద పేరెంట్ కమిటీ చైర్మన్ లేదా మెంబర్ పేరు ఎంటర్ చేయాలి.

@ ఎన్యుమేరేటర్ కాంటాక్ట్ నంబర్ వద్ద వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

@ కాంప్లెక్స్ నేమ్ వద్ద మన పాఠశాల ఏ కాంప్లెక్స్ పరిధిలో ఉందో ఆ కాంప్లెక్స్ పేరు ఎంటర్ చేయాలి.

@ కాంప్లెక్స్ కోడ్ వద్ద కాంప్లెక్స్ యుడైస్ కోడ్ ఎంటర్ చేయాలి.

@ ప్రిన్సిపాల్ పేరు వద్ద మన పాఠశాల హెచ్ఎం పేరు ఎంటర్ చేయాలి.

@ ప్రిన్సిపాల్ కాంటాక్ట్ నంబర్ వద్దా మన పాఠశాల హెచ్ఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

@ సెలెక్ట్ మీడియం వద్ద అన్ని పాఠశాలల వారు ఉర్దూ మీడియం తో సహా ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకోండి.

@ సెలెక్ట్ లొకేషన్ వద్ద విలేజ్ లేదా సిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి.

@ టోటల్ నంబర్ ఆఫ్ మేల్ టీచర్స్ వద్ద మన పాఠశాలలోని ఎంటిఎస్ టీచర్లతో సహా ఎంతమంది ఉంటే అంతమంది సంఖ్య రాయాలి. (వర్క్ అడ్జస్ట్మెంట్ మీద ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు వెళ్లినట్లయితే అట్టి ఉపాధ్యాయులను వారి యొక్క మదర్ స్కూల్ లోనే తెలుపవలెను).

@ టోటల్ నెంబర్ అఫ్ ఫిమేల్ టీచర్స్ వద్ద వారి సంఖ్యను ఎంటర్ చేయాలి.

@ టోటల్ నంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వద్ద బాయ్స్ సంఖ్య ఎంటర్ చేయాలి.

@ టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ వద్ద బాలికల సంఖ్య ఎంటర్ చేయాలి.

@ తరువాత కాలంసు ఫిల్ అప్ అయి ఉంటాయి. చివరలో లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయాలి.

@ ఆ తరువాత ఇప్పుడు మనం చేయవలసిన ఆడిట్ లేదా సర్వే స్టార్ట్ అవుతుంది.

@ అంటే డొమెన్స్ ఓపెన్ అవుతాయి.

@ మొత్తం  ఆరు డొమెన్స్ ఉంటాయి.

@ ప్రతి డొమిన్లో సబ్ టూల్స్ గా అబ్జర్వేషన్, హెచ్ఎం, టీచర్, కమ్యూనిటీ, స్టూడెంట్ అనే ఐదు టూల్స్ ఉంటాయి.

@ ప్రతి టూల్స్ లో ఉండే అన్ని ప్రశ్నలకు జవాబులను ఇచ్చినటువంటి వాటినుండే టిక్ చేయాలి.

@ అవి కూడా మన పాఠశాల లో ఆ అంశం యొక్క స్థితి ఏమిటో తెలుపుతూ ఉంటాయి. వీటి నుండి మన పాఠశాలకు సంబంధించిన స్థితిని మనం ఎంపిక చేసుకుంటాం.

@ ఈ నాలుగు జవాబులు మన పాఠశాలలో ఆ అంశం యొక్క నాలుగు స్థితులను గురించి వివరిస్తాయి.

@ లెవెల్ 1 అసలు లేదు.

@ లెవెల్ 2 మేజర్ రిపైర్స్ ఉన్నాయి.

@ లెవెల్ 3 మైనర్ రిపేర్సు ఉన్నాయి.

@ లెవెల్ నాలుగు ఎటువంటి రిపేర్సు లేకుండా అంతా బాగా ఉంది.

@ ఈ విధంగా అన్ని ప్రశ్నలకు జవాబులను మనం ఇచ్చిన తరువాత చివరలో ఓకే చేస్తే కంప్లీట్ అవుతుంది.

@ మనం ఏ ఏ ప్రశ్నలకు ఏ ఏ జవాబులు ఇచ్చినాము తెలుసుకొనుటకు మన మొబైల్లో ఈ యాప్ యొక్క ఎడమవైపు పై భాగాన మూడు గీతలు ఉంటాయి.

@ వాటిని క్లిక్ చేస్తే మై సర్వే కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే మనం చేసిన డేటా మొత్తం ప్రశ్న దానికింద మనం ఇచ్చిన జవాబు తో సహా కనబడతాయి.

@ ఇక్కడ మనం ఏమైనా మార్పులు చేసుకోవలసి వస్తే ప్రీ వ్యూ క్లిక్ చేసి తప్పు పెట్టిన వాటిని సరి చేసుకోవచ్చు.

@ ఈ విధంగా చేసిన తరువాత చివరలో ఫైనల్ సబ్మిషన్  చేస్తే డేటా మొత్తం సబ్మిట్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఎటువంటి మార్పులు చేసుకోలేము.

@ ఇంతటితో మన సర్వే కంప్లీట్ అయినది.


CLICK HERE TO DOWNLOAD

CLICK HERE TO INSTALL APPLICATION

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top