Saturday 16 March 2024

ఎన్నికల కోడ్ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి (తెలుగులో...)

ఎన్నికల కోడ్ లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి (తెలుగులో...)



• ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకీ, అభ్యర్థికీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు, ఆరో పణలకు ఆస్కారమివ్వకూడదు. ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వ హించే కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీల నుంచి ప్రయోజనం, బహు మతి పొందినా, అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. నిబంధనలు ఉల్లంఘిం చిన ప్రభుత్వోద్యోగులపై ఐపీసీ సెక్షన్ 171, 123తో పాటు ప్రజాప్రాతి నిధ్య చట్టంలోని 134, 134ఏ సెక్షన్ల కింద చట్టపరమైన, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.


• భార్య/భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ సెలవు లేదా పర్యటనలపై వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.


• ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారుల బదిలీలపై నిషేధం ఉంటుంది.


• ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతర రాజకీయ నాయ కుల ఫొటోలేవీ ప్రభుత్వ భవనాల్లో ప్రదర్శించకూడదు.


• మంత్రులు, రాజకీయ నాయకులెవరూ అధికారులతో వ్యక్తిగతంగా, సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించరాదు.


• ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసే లబ్దిదారుల కార్డులు, శిలాఫలకాల్లో ముఖ్య మంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, వారి సందేశాలు ఉండకూడదు.


• ఎంపీ, ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లు, అంబులెన్స్లు తదితరాలపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయ కుల చిత్రాలను కనిపించుకుండా మూసేయాలి.


• ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక ఇచ్చే విద్యుత్తు, వాటర్ బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లు, పార్టీల చిహ్నాలు వంటి వేమీ ఉండకూడదు.


• అభివృద్ధి, నిర్మాణ ప్రాజెక్టులతో సంబంధమున్న ప్రభుత్వ విభాగాలు వాటి పరిధిలో ఇప్పటికే మొదలైన, మొదలు పెట్టాల్సిన పనుల జాబి తాను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top