ఏపీపీఎస్సీ - రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎస్ఐఎంసీ) లో ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎస్ఐఎంసీ)లో 2024 జూలై టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదే శ్కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జూలై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: జూలై 1 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. అంటే 2011 జూలై 2 - 2013 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, వైవావోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లుంటాయి. మేథమె టిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (75 మార్కులు), ఇంగ్లీష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థు లకు వైవావోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవావోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెంటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీలకు రూ.555 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్ చెల్లించాలి. ఆర్ఎస్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవస మైన ధ్రువపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 15
పరీక్షతేదీ: డిసెంబరు 2
వెబ్సైట్: https://psc.ap.gov.in/
0 Post a Comment:
Post a Comment