Thursday 29 December 2022

TEACHERS' ATTENDANCE REGISTER : ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ - నియమాలు, పద్దతులు (జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి)

 TEACHERS' ATTENDANCE REGISTER : ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ - నియమాలు, పద్దతులు (జనవరి  నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి)



1) స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ఉంటాయి. కావున ఈ రిజిష్టర్ లో గత ఏడాది రిజిష్టర్ లో ఎన్ని తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లోని మొదటి పేజీ లో (జనవరి నెలలో)  తప్పకుండా నమోదు చేయాలి.

2) ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం నిర్ణయించబడతాయి కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.

3) సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు  ప్రత్యేకంగా ఫైల్ లో భద్రపరచి C.L. Register నందు నమోదు చేయాలి. వీటికి ప్రధానోపాధ్యాయులు బాధ్యులు.

4) హాజరు పట్టీలో తమ పేరుకు ఎదురుగా బ్లూ, బ్లాక్ పెన్ తోనే సంతకం చేయాలి. రెడ్ పెన్ గాని గ్రీన్ పెన్ గాని వాడొద్దు.

5) ఎవరైనా OD లో వెళ్ళినట్లైతే ఏ పని మీద వెళ్లారు, ఎక్కడికి వెళ్లారో ఆ వివరాలను ఆ తేదీ నాడు ఆయన సంతకం చేయవలసిన ప్రదేశంలో రాయాలి. సంబంధిత అటెండెన్స్ సర్టిఫికెట్ లను సెలవు పత్రాలు భద్రపరచిన చోట ఉంచాలి.

6) ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు , హాజరు రిజిష్టర్ లో సంతకం చేయాలనుకున్నప్పుడు , ఆ రోజు నాటి వరుసలో ప్రధానోపాధ్యాయుల సంతకం క్రింద చేయాలి.

7) స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆరోజు వరుసలో  సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.

8) రిజిష్టర్ లో ముందస్తుగా సెలవు లు రాయకూడదు. ఉదా: ఆదివారం, రెండవ శనివారం.

9) రిజిష్టర్ లో కొట్టివేతలు ఉండకూడదు. వైట్నర్ వాడకూడదు. అనివార్య కారణాల వల్ల కొట్టివేత చేయవలసి వచ్చినప్పుడు ఒక గీత గీసి  పైన రాయాలి దీనిని క్రింద సర్టిఫై చేస్తూ ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి.

10) హాజరు రిజిష్టర్ లో జెల్ పెన్నులు గాని ఇంక్ పెన్నులు గాని స్కెచ్ పెన్నులు గాని వాడకూడదు. బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.

11) ప్రతి నెల పేజీలో పైన పాఠశాల స్టాంప్ (గుండ్రటి స్టాంప్ కాదు) తప్పకుండా వేయాలి.

12) అనివార్య కారణాల వల్ల సంతకం చేసిన చోట చిరిగినట్లైతే సెల్లో టేప్ తో అతికించాలి.

13) రిజిష్టర్ లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు, ఒక వేళ చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవు.

14)ఉద్యోగులు ఎవరైనా సెలవులు పెట్టినట్లైతే ఆ సెలవు రకమును ఖచ్చితంగా రాయాలి.

ఉదా : CL, CCL, SpCL వగైరా

15) కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైనా ( MDM కుక్స్, విద్యా వాలెంటిర్లు, స్కావెంజర్ లు, వాచ్ మెన్ లు, వగైరాలు ) పని చేస్తూ ఉన్నట్లైతే వారికి ప్రత్యేకంగా వేరే రిజిష్టర్ పెట్టాలి మరియు ప్రతి రోజూ వారి సంతకాలు తీసుకోవాలి. దీనిలో అందరి తర్వాత చివరన ప్రధానోపాధ్యాయులు పేరు రాసి రోజూ రెండు పూటలా సంతకం చేయాలి . ఒక వేళ ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటే ఇన్ ఛార్జ్ గారు సంతకం చేయాలి.

16) కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారి పని కాలం అకాడమిక్ సంవత్సరం ప్రారంభం లో ప్రారంభమై, అకాడమిక్ సంవత్సరం చివరి రోజున ముగుస్తుంది. వారు ఎన్ని సంవత్సరాలు పని చేసిన కూడా రిజిష్టర్ లో పై ప్రకారమే తేదీలు రాయాలి.

17)  మే నెలలో బడి నడవక పోయినప్పటికీ హాజరు రిజిష్టర్ లో ఖచ్చితంగా మే నెల రాసి అన్ని వివరాలు రాసి వేసవి సెలవులు అని రాయాలి.

18) ఒక వేళ రిజిష్టర్ లో ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాత కూడా పేజీ లు మిగిలితే తరువాత సంవత్సరంకు కూడా అదే వాడవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత సంవత్సరం పూర్తి అయ్యేందుకు సరి పడా పేజీలు ఉండాలి.అనగా రిజిష్టర్ లో పూర్తి సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి.ఒక సంవత్సరంనకు రెండు రిజిష్టర్లు ఉండకూడదు.ఒక సంవత్సరంనకు ఒక రిజిష్టర్ వాడడం ఉత్తమం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top