Wednesday 28 September 2022

జగనన్న విద్యాకానుక బ్యాగులు రిప్లేస్మెంట్ గురించి యావన్మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులకు క్రింది విధంగా సూచనలు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

సమగ్ర శిక్షా

జగనన్న విద్యాకానుక బ్యాగులు రిప్లేస్మెంట్ గురించి యావన్మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులకు క్రింది విధంగా సూచనలు



ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా...

జగనన్న విద్యాకానుకలో భాగంగా సరఫరా చేయబడిన బ్యాగులు లోపభూయిష్టంగా ఉన్నందున మరియు నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వలన డ్యామేజ్ అయినటువంటి సదరు బ్యాగులు అన్నింటిని కూడా రీప్లేస్ చేసి వాటి స్థానంలో నాణ్యమైన కొత్త బ్యాగులు సరఫరా చేయవలసిందిగా సంబంధిత సరఫరాదారులకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు ఆదేశములు ఇచ్చియున్నారు.

కావున, ప్రధానోపాధ్యాయులు అందరు కూడా జగనన్న విద్యాకానుక యాప్ లో ఏర్పాటు చేయబడిన బ్యాగుల రీప్లేస్ మెంట్ మాడ్యూల్ నందు ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సరఫరా చేయబడి డ్యామేజ్ ఉన్న బ్యాగులు యొక్క వివరాలను సైజులు వారీగా నమోదు చేయవలసిందిగా ఆదేశించడమైనది.

ఈ కార్యక్రమం తేది 07.10.2022 లోగా పూర్తి చేయవలసిందిగా కోరడమైనది. నమోదు చేయబడిన. వివరాలనుబట్టి బ్యాగులు రీప్లేస్ మెంట్ చేయడం జరుగుతుంది. కావున అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఈ వివరాలు వెంటనే నమోదు చేయవలసిందిగా కోరడమైనది. లేనియెడల బ్యాగులు రిప్లేస్ మెంట్ చేయడం సాధ్యపడదు. మరియు ఇందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


రాష్ట్ర అదనపు పథక సంచాలకులు

సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top