కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి కార్యాలయం నుండి WebEx meeting సమావేశం వివరాలు
సదరు సమావేశంలో...
1. వచ్చే నెలలో జరిగే రేషనలైజేషన్ కౌన్సిలింగ్ ఈనెల 28వ తేదీ రోలు ఆధారంగా జరపబడును. కావున అందరూ గమనించి బాలబాలికల వివరాలను వెంటనే చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయవలెను. అట్లు చేయని ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.
2. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఉపాధ్యాయుల హాజరు మొబైల్ ద్వారా కొత్త యాప్ ద్వారా తీసుకొనబడును. సదరు యాప్ లో అన్ని రకాల లీవులు నమోదు చేయవలసి ఉంటుంది. కావున అన్ని రకాల లీవ్ రికార్డులు రెండు రోజుల లోపల అప్డేట్ చేయవలసి ఉంది.
3. విద్యా శాఖలో పనిచేయుచున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, మరియు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది including MIS coordinators ,Data entry operators, జూనియర్ అసిస్టెంట్స్, రికార్డ్ అసిస్టెంట్ మరియు అటెండర్లు అందరూ కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వారి యొక్క డేటా ఎంటర్ చేయవలెను. ఉపాధ్యాయుల ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు TIS డేటాను బేస్ చేసుకుని జరుగుతుంది. కావున అందరూ వారి యొక్క డిజిగ్నేషన్స్ జాయినింగ్ మొదలగు అన్ని రకాల వివరాలు సరిగా ఉన్నవో లేదో చూసుకుని అప్ టు డేట్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
0 Post a Comment:
Post a Comment