Saturday 30 July 2022

ITR Filing : రిటర్నులు ఆలస్యం చేస్తే జరిమానానే కాదు, ఇవీ కోల్పోతారు !

 ITR Filing : రిటర్నులు ఆలస్యం చేస్తే జరిమానానే కాదు, ఇవీ కోల్పోతారు !



► గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ( ITR Filing ) గడువు రేపటి ( జులై 31,2022 )తో ముగియనుంది.

► కొవిడ్ -19 , కొత్త ఐటీ వెబ్సైట్ లో తలెత్తిన సమస్యలు కారణంగా గత రెండేళ్లు ఐటీఆర్ దాఖలుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.

► అయితే ఈ సారి గడువు పొడిగించబోమని ప్రభుత్వం స్పష్టంచేసినప్పటికీ .. గడువు పొడిగిస్తారన్న కారణంతో చాలా మంది రిటర్నులు దాఖలులో ఆలస్యం చేస్తున్నారు.

► ఒకవేళ గడవు పొడిగించకపోతే .. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయని వారు జరిమానాతో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా కోల్పోతారు.

► జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు 2022 డిసెంబరు 31 లోపు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. అయితే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

► ఐటీఆర్ ఆలస్యం చేసినందుకు ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం.. జరిమానాగా రూ .5000 చెల్లించాలి.

► ఇంతకు ముందు ఈపెనాల్టీ రూ.10,000గా ఉండేది. అయితే 2021 బడ్జెట్లో దీన్ని సగానికి తగ్గించారు. వార్షిక ఆదాయం రూ.5లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నవారు రూ .5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానాగా చెల్లించాలి. 

కోల్పోయే ప్రయోజనాలివే...

► ఐటీర్ ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల మూలధన రాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే వీలుండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేయగలరు.

► రిటర్నులు సక్రమంగా ఫైల్ చేసి, ధ్రువీకరించిన తర్వాతే రీఫండ్ లభిస్తుంది. రిటర్నులు దాఖలకు ఆలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా ఆలస్యం అవుతుంది. 

► ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయడం వల్ల రీఫండ్ ఆలస్యమైన ప్రతి నెలకూ 0.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.  ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యం జరిగితే ఈప్రయోజనం కోల్పోతారు. 

► పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే.. ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

► 2022 డిసెంబరు 31 తర్వాత కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి.

ముఖ్య గమనిక :

Incometax e-filing చేయుటకు చివరి తేదీ 31-07-2022.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top