Tuesday 21 June 2022

బదిలీలపై చర్చించే నిర్ణయం ప్రకటిస్తాం : ఉపాధ్యాయ సంఘాలతో చర్చలో మంత్రి బొత్స

బదిలీలపై చర్చించే నిర్ణయం ప్రకటిస్తాం : ఉపాధ్యాయ సంఘాలతో చర్చలో మంత్రి బొత్స



రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, 117 జీవోపై వ్యక్తమవుతున్న అభ్యంత రాలపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణచర్చించారు. ఈ సందర్భంగా జీవో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు 117 లో ఉన్న లోపాలను సవరించాలని కోరగా వాటిలోని మార్పులను త్వరలోనే అధికారులతో చర్చించి తగు నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తెలియజేశారు. త్వర లోనే బదిలీలు కూడా చేపడతామని, బదిలీలకు సం బంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేసి ఉపా: ధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ సందర్భంగా జీరో (0) సర్వీస్లో బదిలీ లను అవకాశం ఇవ్వాలని గరిష్టంగా 8 సంవత్సరాల సర్వీసు తప్పనిసరి బదిలీకి అవకాశం కల్పించాలని, 80 పైగా వైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని, 117 జీవో వలన తప్పనిసరి బదిలీకి గురైన జూనియర్ ఉపాధ్యాయు లకు గతంలో పనిచేసిన పాత స్టేషన్ పాయింట్లను కేటాయించాలని ప్రాతినిధ్యం చేశారు. సమావేశంలో వివిధ అంశాలపై ఆయా సంఘాలు మంత్రికి వినతి. పత్రాలు అందజేశాయి. సమావేశంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, విద్యాశాఖ అధి కారులు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్, ఎస్టీ యూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్,హెచ్. తిమ్మన్న, ఆర్టీయూ రాష్ట్ర అధ్య క్షులు మిట్ట కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వైష్ణవ కరుణానిధి మూర్తి, అప్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించక పోవడం సరికాదు: ఫోర్టో

రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను 117 జీవోపై చర్చించేందు. కు విద్యాశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానిం చకపోవడం సరికాదని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘా వేదిక(ఫోర్టో) రాష్ట్ర చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం తెలిపారు. ఫోర్టోను సమావేశానికి ఆహ్వానించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. గతంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించిన విషయం గుర్తు చేశారు. ఈసారి రికగ్నైజ్, రిజిస్టర్డ్ అనే వివక్ష లేకుండా విద్యారంగ, ఉపాధ్యాయుల అంశాలపై సమన్వయ సమావేశం నిర్వహిస్తే రిజిస్టర్డ్ ఉపా ధ్యాయ సంఘాలను కూడా ఆహ్వానించాలని కోరు తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్పెషల్ సీఎన్ బి. రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ కు లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేసినట్లు పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాలు నేడు. విడుదల చేయనున్న బొత్స :

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడు దల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభించడంతోపాటు జూలై ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top