Saturday 7 May 2022

ఆదివారమూ పనిచేయాలి - యూడైస్ డేటాను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి : ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశం

 ఆదివారమూ పనిచేయాలి - యూడైస్ డేటాను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి : ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశం



■ రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఆదివారం పని చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల సమాచారాన్ని (యూడైస్ ప్లస్) డేటాను పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు ఆదివారం సిబ్బంది అందరూ పని చేయాలని స్పష్టం చేశారు.

■ 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో యూడైస్ డేటా పూర్తి స్థాయిలో సమగ్రంగా నమోదు చేయకపోవడం వల్ల నీతి ఆయోగ్ ర్యాంకింగ్, పీజీఐ, ఎసీజీ ఇండికేటర్లలో రాష్ట్ర ర్యాంకు పడిపోయిందని వివరించారు.

■ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు నడవకపోవడం కూడా ఒక కారణమే.

■ ఈ నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి డేటాను సమగ్రంగా నమోదు చేసేందుకు సిబ్బంది అందరూ ఆదివారం పని చేయాలని ఆదేశించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top