Saturday, 30 April 2022

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నందు కమిషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాలు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నందు కమిషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాలు



✍️ ప్రశ్నపత్రంపై విద్యార్థి చేత పేపర్ ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ పూర్తిగా వేయించాలి.

✍️ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్ష కేంద్రంలో నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేటు పాఠశాలల సిబ్బంది లేదా సి.ఆర్.పిల సేవలు వినియోగించుకుంటూ ఉంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి. సి.ఆర్.పిలు పరీక్షా కేంద్రం లో ఉండకూడదు.

✍️ వాటర్ బాయ్ గా లేదా జవాబు పత్రాలు బండిల్స్ కుట్టడానికి ఎవరినైనా వినియోగించుకుంటుంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి.

✍️ వాటర్ బాయ్ పరీక్ష ప్రారంభానికి ముందే వాటర్ పోసి బయటికి వెళ్లి పోవాలి. పరీక్ష జరిగే సమయంలో వాటర్ బాయ్ పరీక్షా కేంద్రంలో ఉండడానికి వీల్లేదు

✍️ 8వ మరియు 9వ తరగతి విద్యార్థులను వాటర్ బయటగా వినియోగించుకుంటూ ఉంటారు. వారిని వాటర్ బాయ్ గా వినియోగించుకో కూడదు

✍️ పరీక్షా కేంద్రాలలో కొంతమంది విద్యార్థులు డిజిటల్ వాచ్ లు పెట్టుకుని వస్తున్నట్లు సమాచారం ఉంది వాటికి అనుమతి లేదు

✍️ ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్  లు ఎవరైనా.. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. ఎవరైనా  సెల్ ఫోన్ తీసుకెళ్లి నట్లయితే సస్పెండ్ చేయమని కమీషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

✍️ పరీక్ష హాలు లో ఇన్విజిలేటర్ ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉన్నట్లయితే ఎటువంటి  తదుపరి‌ విచారణ లేకుండా సస్పెండ్ చేయడం జరుగుతుంది

✍️ పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్  కేసులు ఎవైనా బుక్ అయినట్లయితే  యాక్ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top