డిజిటల్ హెల్త్ కార్డులతో దేశంలో ఎక్కడైనా చికిత్సలు - ఆధార్ అనుసంధానం : ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో జేసీ గణేష్
డిజిటల్ హేల్త్ కార్డుల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం... చికిత్సలు పొందవచ్చని జాయింట్ కలెక్టర్ గణేష్కుమార్ త్రుల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించి ప్రసంగించారు. డిజిటల్ హెల్త్ కార్డులను ఆధార్ అనుసంధానం చేస్తారని, వీటి ద్వారా దేశంలో ఎక్కడైనా ఆసుపత్రులలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వైద్య ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్ శాస్త్రి మా ట్లాడుతూ ఎవరైనా అనారోగ్యంతో డిజిటల్ హెల్త్ కార్డుతో ఆసుపత్రులకు వెళ్లితో వెంటనే ఆయా వ్యాధులకు సంబంధించి రిజిస్టర్ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్ డాక్టర్ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజు, అదనపు డీఎం హెచ్ డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ రమాదేవి, రాష్ట్ర ఐటీ బృందం తేజవర్మ, రాజికిరణ్, సూర్యవర్మ, డీటీసీవో డాక్టర్ వెంకటప్రసాద్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment