Private Schools TC Judgement
ప్రైవేటు స్కూల్స్ లో చదివే విద్యార్థులు టి.సి (ట్రాన్స్ ఫర్ సెర్టిఫికేట్ ) కావాలంటే విధిగా వారికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు లో 50% చెల్లించిన తర్వాత మాత్రమే టి.సి ఇచ్చేలా విధంగా ఏపి హై కోర్టు తీర్పు ఇచ్చింది.
గతం లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టి.సి ఇచ్చే విషయం లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయనే విషయాన్ని విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళగా, టి.సి ఇచ్చే విషయం లో విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని ఫీజులు సాకు గా చూపి ఆపడం సరి కాదని భావించి వెంటనే టి.సి అడిగిన వారికి టి.సి లు జారీ చేయాలని విద్యాశాఖ అన్ని ప్రైవేటు స్కూలు యాజమాన్యాలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల సంఘం (APPUSMA) ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రిట్ పిటిషన్ 9606/2021 ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు విచారణ జరిపి టి.సి ఇచ్చే విషయం లో ప్రైవేట్ స్కూల్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ యు.దుర్గా ప్రసాద రావు తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పు ప్రకారం ప్రైవేటు స్కూల్స్ లో చదివే విద్యార్థులు టి.సి (ట్రాన్స్ ఫర్ సెర్టిఫికేట్ ) కావాలంటే విధిగా వారికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు లో 50% చెల్లించిన తర్వాత మాత్రమే టి.సి ఇస్తారు. మిగిలిన్ 50% శాతం ఫీజును 6 వాయిదాలలో చెల్లించే విధంగా తల్లిదండ్రుల వద్ద ప్రమాణ పత్రాన్ని ఇవ్వాలి అని పేర్కొంది. ఈ విషయం లో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టవద్దని విద్యాశాఖ అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది.
ఈ తీర్పు మేరకు అందరు విద్యా శాఖ అధికారులు నడుచుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
0 Post a Comment:
Post a Comment