Friday 11 February 2022

4వ తరగతి పాఠ్యపుస్తకంలో ఏపీ రాజధాని పేరు ముద్రించలేదనే వార్తలు పూర్తిగా అవాస్తవం : ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్

 4వ తరగతి పాఠ్యపుస్తకంలో ఏపీ రాజధాని పేరు ముద్రించలేదనే వార్తలు పూర్తిగా అవాస్తవం : ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్



నాలుగో తరగతి పాఠ్య పుస్త కంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ముద్రించలేదని, ఏపీ రాజధాని మాయం అంటూ కొన్ని చానల్స్ లో ప్రసారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకంలో ముద్రించిన భారతదేశ మ్యాప్లోను, 'మీకు తెలుసా' శీర్షిక కింద ఇచ్చిన రాష్ట్రాల రాజధానుల్లోను ఆంధ్రప్రదేశకు ఎదురుగా అమరావతి అని స్పష్టంగా ముద్రించి ఉందని తెలిపారు. 6వ తరగతిలో ఇచ్చిన ఇండియా మ్యాచ్లలో కూడా అమరావతి పేరు స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ముద్రించిన ద్విభాషా పాఠ్యపుస్తకాల్లో 4వ తరగతిలో 50, 51 పేజీల్లో ఇంగ్లిష్, తెలుగు రెండు మీడియంలలోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టంగా ఉందని వివరించారు. పాఠ్యపుస్తకాలు, కరదీపికలు రూపొందించడంలో ఎస్సీఈఆర్టీ ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. విద్యార్థు జ్ఞానాన్ని అందించే పాఠ్యపుస్తకాల విషయంలో ఈ విధమైన అసత్య ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. గతంలో కూడా కొన్ని సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో దేవతల విషయంలో కూడా అసత్య ప్రచారం చేశారని, మేధావులు, ఉపాధ్యాయులు ఆ విషయాన్ని ఖండించారని గుర్తుచేశారు. విద్యాసంబంధ విషయాల్లో రాజకీయాలు చొప్పించవద్దని ఆయన కోరారు. ఆయా తరగతుల్లో ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టంగా పేర్కొన్న పేజీల ప్రతులను ఆయన విడుదల చేశారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top