అలా మాట్లాడటం సరికాదు - హెచ్‌ఆర్‌ఏ 10 శాతాన్ని ఉపాధ్యాయ నేతలే కోరారు: సజ్జల
ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతల సూచన మేరకే హెచ్‌ఆర్‌ఏ ఖారారు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎక్కువమంది టీచర్లు 50వేల మంది జనాభాకు లోపలే ఉంటారని, వారికి రూ.10వేలు చేయాలని కోరితేనే ఆమోదించామన్నారు. మినిట్స్ పూర్తయ్యాక, సీఎస్ వెల్లడించాక అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. చర్చల్లో హెచ్‌ఆర్‌ఏ మార్పులకు ఆమోదించి బయటకొచ్చి మరోరకంగా మాట్లాడం కరెక్టు కాదన్నారు. ఇదొక్కటే తనకు అపశ్రుతిలా అనిపించిందన్నారు. చర్చల సమయంలోనే అభ్యంతరం చెప్పి ఉంటే, దానిపై మరింత చర్చ జరపడమో, చర్చల ప్రక్రియను వాయిదా వేయడమో జరిగేదన్నారు. హెచ్‌ఆర్‌ఏ 10శాతం చేయాలని ఉపాధ్యాయ సంఘ నేతలే కోరారన్నారు.
░▒▓█🄳🄰🅁🄸🅈🄰 🄸🄽🄵🄾 █▓▒░
0 Post a Comment:
Post a Comment