Sunday 23 January 2022

PRC సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం - ముఖ్యాంశాలు

 PRC సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం - ముఖ్యాంశాలు



✌ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీ సాగర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది.

✌ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ సంఘం, గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం, ఆంధ్రప్రదేశ్  గెజిటెడ్ ఆఫీసర్ సంఘం ,ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ,ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్స్ కమిటీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, ఆలిండియా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం, రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ లక్ష్మణ రావు గారు సిఐటియు సభ్యులు, రాష్ట్ర బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,రాష్ట్ర పోస్టల్ ఉద్యోగుల సంఘం,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం మరియు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘం తదితర సంఘాలు పాల్గొనడం జరిగింది.

✌ మొదటిగా వివిధ సంఘాలు అన్నీ ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమని, ఈ సంఘ ఐక్యత  ముందు కూడా కొనసాగాలని అప్పుడే మన పోరాటం విజయవంతమవుతుందని ఆకాంక్షించారు.

✌ జనవరి 20వ తారీఖున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం అవ్వడాన్ని అభినందిస్తూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చింది.

✌ కొత్త పిఆర్ సి సి ప్రకారం ఫిబ్రవరి నెలలో జీతాలు చెల్లింపుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది.

✌ రాష్ట్ర ఉద్యోగులను ప్రజల లో పలుచన చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని దీనికి ఉద్యోగ సంఘాలు కూడా కరపత్రాల తో ప్రజలలోకి వెళ్లి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడింది.

✌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు సంకుచిత దృక్పథం తో రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను విమర్శించ వద్దు అని హితవు పలికింది.

✌ ప్రభుత్వం చర్చలతో పరిష్కారమయ్యే వాతావరణం నుండి ఘర్షణ వాతావరణానికి సమస్యను మళ్లించిందని ఇది మంచిది కాదని ,ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి, ఉద్యోగుల పట్ల తమ సానుకూల దృక్పధాన్ని చాటుకోవాలని కోరింది.

✌ ఉద్యోగుల సమస్యల అన్నింటిలో అతి ముఖ్యమైనది సిపియస్ ఉద్యోగుల సమస్యని, సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

✌ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల అందరిని దశలవారీగా పర్మినెంటు ఉద్యోగులు గా మారుస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేసింది.

✌ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగంలో చేరినప్పటి నుండి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఇప్పుడు నూతన పిఆర్సి లో వారికి 15 వేల రూపాయలు ఇస్తామని అని చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని గర్జించింది. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగంలో చేరి సుమారు పది సంవత్సరాలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం పి ఆర్ సి ప్రకారం పదేళ్ల తరువాత పీఆర్సీ కమిటీకి ఇస్తే వీరి జీతం ఎప్పుడు ఎంత పెరుగుతుందో అయోమయమే అని విచారం వ్యక్తం చేసింది. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు అందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరింది.

✌ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం విచారకరమని ,వారి ప్రొబేషన్ డిక్లరేషన్ కనీసం జూన్ 30 నాటికి పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని గుర్తు చేసింది.

✌ ప్రభుత్వం జగనన్న స్మార్ట్ సిటీలో ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ప్లాట్ల కేటాయింపు కేవలం  బూటకమని, 14 వేల రూపాయల గజం ధర తో సగటు ప్రభుత్వ ఉద్యోగి మూడు సెంట్లు కొనుక్కోవాలంటే 20 లక్షలు వ్యయం అవుతుందని, ఇది సాధ్యం అయ్యే పని కాదని ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరారు.

✌ ప్రభుత్వం పిఆర్సి పై నిర్ణయించేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రక్రియను చేపట్టలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చట్టసభలలో ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిర్ణయాలు చేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికింది.

✌  రాష్ట్రంలో లోటు బడ్జెట్ ల ఉన్నప్పుడు మాకు నూతన పిఆర్సి అవసరం లేదని పాత పిఆర్సి ప్రకారమే మాకు జీతాలు చెల్లించాలని, హెచ్ ఆర్ ఏ పాత రేట్లను యధావిధిగా కొనసాగించాలని, డీఏ బకాయిలను చెల్లిస్తే చాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకొంది.

✌ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని, ప్రజాస్వామ్యంలో సంబంధిత సంఘాలతో, నిపుణులతో చర్చించి మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా పి ఆర్ సి ని నిర్వహించాలని గుర్తు చేసింది.

✌ రేపటి నుండి గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పై ముద్రించిన అవాస్తవాలతో  కూడిన కరపత్రాలను పంపిణీ చేయడం  ఖండించింది.

✌ చివరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కేవలం ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా మాత్రమే అన్ని జరగవని,సంఘ సభ్యులు అందరూ కూడా వారి మద్దతును భయపడకుండా కొనసాగించాలని,  ఈ సమయం మన శక్తిని ప్రదర్శించే సమయమని మనవి చేసింది.

👉🏻 రాష్ట్ర ప్రభుత్వ పిఆర్సి విధానాన్ని ఐదేళ్లకొకసారి కొనసాగించాలని పట్టుబట్టింది.

👉🏻 ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ అవమానించే ప్రభుత్వాలు చరిత్రలో కొనసాగింది లేదని, ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించింది.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top