Saturday 15 January 2022

Holidays : తెలంగాణ‌లో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం..? ఇక అంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే..?

 Holidays : తెలంగాణ‌లో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం..? ఇక అంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే..?కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో సంక్రాంతి సెలవులు జ‌న‌వ‌రి 16తో ముగియ‌నున్నాయి. అలాగే జ‌న‌వ‌రి 17 నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది క‌నుక‌.. మళ్లీ ఇప్పట్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమేనని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా ఆంక్షలను...

రాష్ట్రంలో కరోనా ఆంక్షలను జ‌న‌వ‌రి 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 20వ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. అలాకాకుండా ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అటు ప్రత్యక్ష తరగతులు, ఇటు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించలేదన్న విమర్శలు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే సెలవులు పొడిగింపుపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలనే అమలు చేస్తామని చెబుతున్నాయి. అయితే సెలవులు పొడిగిస్తారా? లేదా? అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.

పతాక స్థాయికి వెళ్తే...?

రాబోయే రెండు వారాలు కేసులు పతాక స్థాయికి వెళ్లే ప్రమాదం ఉన్నందున జ‌న‌వ‌రి 16తో ముగుస్తున్న హాలిడేస్ ను మరో రెండు వారాలు పొడిగిస్తే బెటర్అని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి అంతర్గతంగా వివరించింది. చిన్న పిల్ల‌ల‌లో వ్యాప్తి పెరగకుండా ఈ నిర్ణయం మేలును చేకూరుస్తుందని స్పష్టం చేసింది.ఇందు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులను బోధించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీల ద్వారా కూడా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

సీఎం మరోసారి...

రెండు వారాల పాటు కట్టడి చర్యలను సీరియస్ గా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ నొక్కి చెప్పింది. అయితే ఈ అంశంపై సీఎం మరోసారి సమీక్ష నిర్వహించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. స్కూళ్లు, హాస్టళ్లు తెరవడం వలన ఒమిక్రాన్ కు ఇవి హాట్ స్పాట్లుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువ స్కూళ్లల్లో వ్యాప్తి జరిగితే బెడ్లు, మ్యాన్ పవర్ సరిపోదని వైద్యారోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో కనీసం ఈ రెండు వారాల పాటు పిల్లలకు సెలవులు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్యశాఖలోని అధికారులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. సెలవులను పొడిగించడం వలన విద్యార్ధులకు కొంత వరకు నష్టం జరిగినా, ప్రాణాలు కంటే ఏదీ ముఖ్యం కాదు కదా? అంటూ ఉన్నతాధికారులు వ్యాఖ్యనిస్తున్నారు.

సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని...

జ‌న‌వ‌రి 20 వరకు కేంద్రం కరోనా ఆంక్షలు పొడిగించడం, వైరస్‌ కట్టడి దిశగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టడాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. విద్యాసంస్థల్లో శానిటైజేషన్‌ అమలుపైనా క్షేత్ర స్థాయిలో అనుమానాలున్నాయి. వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సంక్రాంతి సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితిపై విద్యాశాఖ మంత్రి కూడా నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో అధికారులు తాజా పరిస్థితిపై సమగ్ర వివరాలు ఇచ్చినట్లు ఓ అధికారి చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందని, సాధ్యమైనంత వరకూ సెలవుల పొడిగింపు వైపే ఆలోచన సాగుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇక అంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే...

ఇంట‌ర్ కాలేజీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్రాంతి సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ఉంటాయి. అలాగే జ‌న‌వ‌రి 17వ తేదీన కాలేజీల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అన్ని ప్ర‌భుత్వ , ప్రైవేట్ కాలేజీల‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్టు ఏపీ ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించింది. అలాగే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు కూడా సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది క‌నుక ఏపీ ప్ర‌భుత్వ ఎలాంటి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top