కర్ణాటకలో జనవరి 31 వరకు సెలవులు... మరి తెలుగు రాష్ట్రాల్లో...?
బెంగళూరులో 1 నుంచి 9 తరగతుల పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. జనవరి 31 తర్వాత పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణలో అయితే...
తెలంగాణలో సంక్రాంతి సెలవులు జనవరి 16తో ముగియనున్నాయి. అలాగే జనవరి 17 నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది కనుక.. మళ్లీ ఇప్పట్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమేనని తెలుస్తోంది.రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
పతాక స్థాయికి వెళ్లే ప్రమాదం...
రాబోయే రెండు వారాలు కేసులు పతాక స్థాయికి వెళ్లే ప్రమాదం ఉన్నందున జనవరి 16తో ముగుస్తున్న హాలిడేస్ ను మరో రెండు వారాలు పొడిగిస్తే బెటర్అని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి అంతర్గతంగా వివరించింది. చిన్న పిల్లలలో వ్యాప్తి పెరగకుండా ఈ నిర్ణయం మేలును చేకూరుస్తుందని స్పష్టం చేసింది.ఇందు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ ద్వారా క్లాసులను బోధించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీల ద్వారా కూడా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
సీఎం మరోసారి...
ఈ రెండు వారాల పాటు కట్టడి చర్యలను సీరియస్ గా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ నొక్కి చెప్పింది. అయితే ఈ అంశంపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని సెక్రటేరియట్ లో
0 Post a Comment:
Post a Comment