Thursday 13 January 2022

Employee Union Leaders On PRC

 Employee Union Leaders On PRC 

 


ప్రభుత్వ ఉద్యోగుల హెచ్​ఆర్​ఏ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ అంశంపై నిన్నంతా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. సంక్రాంతి ముగిసేవరకూ హెచ్​ఆర్​ఏ సహా ఇతర అంశాల సంబంధిత జీవోలు విడుదల చేయబోమని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రస్తుత పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదని సీఎంవో అధికారుల దృష్టికి తీసుకొచ్చామని అమరావతి జేఏసీ నేత బండి శ్రీనివాస్ వెల్లడించారు. పాత పీఆర్​సీ అయినా ఇవ్వాలని కోరామన్నారు. ఈ పీఆరీసీతో జీతాలు పెరగకపోగా తగ్గుతున్నాయని చెప్పామన్నారు.

"నిన్న రెండుసార్లు, ఇవాళ ఒకసారి చర్చలు జరిపాం. ప్రస్తుత పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదని చెప్పాం. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వాలని కోరాం. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. జిల్లా, పురపాలిక, మండలాల్లో పనిచేసే వారికి వివిధ కేటగిరిల్లో హెచ్‌ఆర్‌ఏ. ఒకే కేటగిరీ చేసి హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. పీఆర్‌సీపై ఉద్యోగులు, పింఛనుదారులు అసంతృప్తితో ఉన్నారు. ఈ పీఆర్‌సీతో జీతాలు పెరగకపోగా  తగ్గుతున్నాయని చెప్పాం. సంక్రాంతి వెళ్లాక సరైన రీతిలో న్యాయం చేస్తామని చెప్పారు. సీఎంతో మాట్లాడాకే జీవో ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యల మేరకు మా కార్యాచరణ ఉంటుంది. మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటం." 

-బండి శ్రీనివాస్‌, అమరావతి జేఏసీ ఛైర్మన్


నాలుగు అంశాలు పీఆర్​సీ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఉన్నాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమతో చర్చించకుండానే జీవోలు తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. తమతో చర్చలు జరపకుండా జీవోలు వద్దని సీఎంవో అధికారులను కోరామని తెలిపారు. రెండ్రోజులు ఓపిక పట్టాలని సీఎంవో అధికారులు చెప్పారని వివరించారు.

"4 అంశాలు పీఆర్‌సీ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఉన్నాయి. మాతో చర్చించకుండానే జీవోలు తెచ్చేందుకు యత్నించారు. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్ అని ఉద్యోగులు కోపంతో ఉన్నారు. గత హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛన్లపై రాజీపడబోమని చెప్పాం. మాతో చర్చించకుండా జీవోలు ఇవ్వవద్దని అధికారులను కోరాం. రెండ్రోజులు ఓపిక పట్టాలని సీఎంవో అధికారులు చెప్పారు." 

-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top