"వాళ్లు శత్రువులు కాదు... మా ఉద్యోగులే’'
ఉద్యోగులతో చర్చల కోసం ఎదురుచూశామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. ఉద్యోగులను పిలిచి చర్చల కోసం ఎదురు చూసినా వారు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈరోజు(గురువారం) ఏపీ సచివాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉద్యోగుల కోసం ఎదురు చూసాం. వ్యక్తిగతంగా కూడా రమ్మని పిలిచాం. ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుంది. టీవీల ద్వారా పరిష్కారం జరగదు. సమ్మె చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. రేపటి నుండి కూడా మేము అందుబాటులో ఉంటాము. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తాం. వాళ్ళు శత్రువులు కాదు.. మా ఉద్యోగులే’ అని సజ్జల తెలిపారు.
0 Post a Comment:
Post a Comment