Tuesday 11 January 2022

రగులుతున్న మాస్టార్లు - ఫిట్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి : జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలతో నిరసనలు

 రగులుతున్న మాస్టార్లు - ఫిట్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి : జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలతో నిరసనలు 



ఫిట్‌మెంట్‌ను 23శాతానికి పరిమితం చేయడంపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ల కొనసాగింపు డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్‌టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. మంగళవారం కడపలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఎస్టీయూ కార్యనిర్వాహక కార్యదర్శి బాలగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుంద ర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి త హసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, రాయచోటి, కమలాపురం, బద్వేలు, మైదుకూరుల్లోనూ ర్యాలీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐ.విజయసారథి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కందుకూరు, చీరాల, అద్దంకి, మార్టూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, గిద్దలూరు, పొదిలి, కంభం తదితర ప్రాంతాల్లోనూ ధర్నాలు నిర్వహించారు.

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డీఆర్వో పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం పీఆర్‌సీని సమీక్షించే వరకు పోరాడతామని ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్‌.తిమ్మన్న అన్నారు. చాగలమర్రిలో ఎస్టీయూ నాయకులు పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌లలో ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగాయి. 

ఫిట్‌మెంట్‌ను పునఃసమీక్షించాలి : ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ డిమాండ్‌ 

ప్రభుత్వం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను పునఃసమీక్షించాలని ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య, సెక్రటరీ జనరల్‌ అజయ్‌ మేడిపల్లి డిమాండ్‌ చేశారు.  19 గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల సమన్వయంతో ఏర్పడిన ఏపీ గెజిటెడ్‌ ఉద్యోగుల జేఏసీ అమరావతి సచివాలయంలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగించాలని, ప్రస్తుతం ఖర్చులు విపరీతంగా పెరిగినందున సీసీఏను పెంచాలని విజ్ఞప్తి చేసింది. పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ను కొనసాగించాలని సంఘం డిమాండ్‌ చేసింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top