Monday 31 January 2022

'గుడ్డు’లో గోల్‌మాల్‌ : స్కూలు పిల్లలకు సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు

‘గుడ్డు’లో గోల్‌మాల్‌ : స్కూలు పిల్లలకు సరఫరా కాంట్రాక్టులో అక్రమాలుపౌలీ్ట్ర రైతుల్ని కాదని కాంట్రాక్టర్లకు అప్పగింతరైతులే అర్హులని.. ఆ వెంటనే టెండరులో సవరణరైతులకు వీలుకాని విధంగా షరతుల విధింపుసీఎం జిల్లాలోనూ కాంట్రాక్టర్ల చేతికే సరఫరా తెరవెనక డబ్బు చేతులు మారిందనే విమర్శలు‘మధ్యాహ్న భోజనం’ అధికారులపై ఆరోపణలు 

పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే కోడి గుడ్డు సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. పౌల్ర్టీ రైతులకు మాత్రమే ఇస్తామన్న కాంట్రాక్టును కాంట్రాక్టర్లకు అప్పగించారు. టెండర్లు పిలిచినప్పుడు కూడా పౌల్ర్టీ రైతులే అర్హులని పేర్కొన్నారు. ఆ తర్వాత టెండరుకు సవరణ చేసి లీజుదారులను కూడా అర్హులుగా చేర్చారు. మరోవైపు మొదటి టెండరులోనే వ్యూహాత్మకంగా నిబంధనలు పెట్టారు. పౌల్ర్టీ రైతులకు అందనంత ఎత్తులో షరతులు విధించారు. కోడి గుడ్డు టెండర్లలో పాల్గొనేవారి టర్నోవర్‌ ఏటా రూ.20 కోట్లు ఉండాలని.. మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి ఉండాలని.. ఇప్పుడు టెండరు దాఖలు చేస్తున్న సామర్థ్యంలో సగమైనా గతంలో ప్రభుత్వానికి సరఫరా చేసుండాలని.. తదితర షరతులు పెట్టారు. వాస్తవానికి ఇవేమీ పౌల్ర్టీ రైతులకు ఉండవు. ఈ నిబంధనలు, షరతుల వ్యవహారంలో అఽధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కావాల్సిన వారికే కాంట్రాక్టులు చాలా కాలం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వారానికి కొన్ని రోజులు కోడి గుడ్డు ఇస్తున్నారు. గుడ్లు సరఫరాకి ఎప్పటికప్పుడు టెండర్లు పిలుస్తుంటారు. ఈ ఏడాది గుడ్ల సరఫరా కోసం నెల రోజుల క్రితం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా టెండర్లు పిలిచారు. పౌల్ర్టీ రైతులను ప్రోత్సహించేందుకు వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. నిబంధనలు మాత్రం కాంట్రాక్టర్లకు అనుకూలంగా పెట్టారు. ఆ తర్వాత లీజుదారులు కూడా పాల్గొనవచ్చని టెండర్‌కు సవరణ చేశారు. పౌల్ర్టీ రైతుల నుంచి గుడ్డు కొనుగోలు చేసే వ్యాపారులు, పౌల్ర్టీలను లీజుకు తీసుకుని వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు కూడా అర్హులన్న మాట. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా పౌల్ర్టీ రైతులకు కాకుండా ఇతర జిల్లా నుంచి వచ్చిన కాంట్రాక్టరుకు టెండర్‌ దక్కింది. 

కోట్ల రూపాయల వసూలు!కాంట్రాక్టుల వ్యవహారంలో కొందరికి అనుకూలంగా వ్యవహరించడం, టెండర్లలో సవరణ చేయడం, నిబంధనలు పెట్టడం.. వీటి వెనుక మధ్యాహ్న భోజన పథకం చూసే విభాగంలోని ఒక సూపరింటెండెంట్‌, గతంలో వివాదాస్పదంగా వ్యవహరించిన మరో అధికారి ప్రధానపాత్ర పోషించారని సమాచారం. పైస్థాయి వారికి ఇవ్వాలంటూ పలువురి పేర్లు చెప్పి సొమ్ములు వసూలుచేసి టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా విచారణచేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని పౌల్ర్టీ రైతులు చెబుతున్నారు. కోడి గుడ్డుకు సరైన ధర లభించక ఇబ్బందులు పడుతున్న సమయంలో పౌల్ర్టీ రైతులను ఆదుకోవాల్సింది పోయి కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ర్టీ రైతులే నేరుగా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు ఉన్నట్టయితే ప్రభుత్వానికి తక్కువ ధరకే గుడ్డు వచ్చేదని అంటున్నారు. అటు రైతులకు మేలు జరగడంతో పాటు.. ఇటు ప్రభుత్వానికి కూడా నిధులు ఆదా అయ్యేవని చెబుతున్నారు. అధికారుల కాసుల కక్కుర్తితో ఆ ప్రయోజనాలు నెరవేరలేదనే విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top