ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై నేతల భేటీ నేడు
ఉద్యోగుల ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు సంయుక్తంగా సోమవారం భేటీ కానున్నారు. పీఆర్సీ అమలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల చెల్లింపు, డీఏ బకాయిల విడుదల, సీపీఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉద్యమం చేపట్టగా వాటన్నింటినీ పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీతో గత నెల 17న దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నేతలు గుర్తు చేశారు. అయితే.. ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడంవల్ల సోమవారం భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు ఏపీ జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు, వైవీ రావు తెలిపారు. రెండు ఐకాసల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియేట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం విజయవాడలో నిర్వహించనున్నారు.
0 Post a Comment:
Post a Comment